Post Office Scheme: ప్రస్తుత కాలంలో పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందనే విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఆదాయం పెంచుకునేలా ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు ప్రధానంగా సెక్యూరిటీ, రాబడిపై దృష్టి పెడితే మంచిది. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంఐఎస్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది.

మెచ్యూరిటీ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని రాబడిగా పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ లో సంవత్సరానికి 6.6 శాతం వడ్డీగా లభిస్తోంది. ఈ ప్లాన్ కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా 10 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 3,300 రూపాయలు పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో 4.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 2,475 రూపాయల చొప్పున పొందే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ప్రతి నెలా వడ్డీ చెల్లించడం జరుగుతుంది. వడ్డీని ఆటో క్రెడిట్ ద్వారా పోస్టాఫీస్ లేదా ఈసీఎస్‌లో ఉన్న సేవింగ్స్ ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. డిపాజిటర్ వద్ద ఉన్న వడ్డీపై ట్యాక్స్ ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ గురించి తెలుసుకోవచ్చు.
మూడేళ్ల ముందు ఖాతాను క్లోజ్ చేస్తే 2 శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు. మూడేళ్ల తర్వాత ఐదేళ్ల లోపు ఖాతా మూసివేస్తే ఒక శాతానికి సమానమైన తగ్గింపును మినహాయిస్తారు.