Women’s Empowerment: ఆడవాళ్లంటే అబలలు కాదు సబలలు అని నిరూపిస్తున్నారు. ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ వారి డిమాండ్ ఉన్నా ఆడవారికి అన్నింటా అన్యాయమే జరుగుతోందని వాదన ఉన్నా వారు కూడా అన్నింట్లో రాణిస్తున్నారు. ఏ రంగం చూసినా ఎంతటి తెగువనైనా చూపించి త్యాగాలు చేస్తూ జీవనరంగంలో దూసుకెళ్తున్నారు. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడాలున్నాయి. మహిళలు అన్నింట్లో తమదైన శైలిలో తమ సత్తా చాటుతున్నారు. డ్రైవర్ దగ్గర నుంచి పైలట్ వరకు అన్ని వృత్తులు చేస్తూ మగవారికి సమానంగా సవాలు విసురుతున్నారు.

మహిళా సాధికారత బిల్లు కొన్నాళ్లుగా పార్లమెంట్ లో నానుతూనే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెబుతున్నా అది సాధ్యం కావడం లేదు. ఫలితంగా ఆ బిల్లు బుట్టదాఖలే అవుతోంది. కానీ వారు మాత్రం ప్రస్తుతం సమాజంలో అన్ని రంగాల్లో దూకుడు పెంచారు. ఒకప్పుడు వంటింటి కుందేలుగా పిలిచినా ప్రస్తుతం కుటుంబంలో ఇద్దరు ఉద్యోగాలు చేసినా ఇంకా లోటు ఏర్పడే పరిస్థితులు రావడంతో మగవారు సైతం అర్థం చేసుకుని మహిళలు ఉద్యోగాలు చేయడానికి ఓకే చెబుతుండటం గమనార్హం.
Also Read: Kavitha: ఢిల్లీలో కేసీఆర్ వెంట కవిత.. ఆ బాధ్యతలు ఆమెకేనా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వందమందిలో 47.9 శాతం మంది మహిళలే ఉంటున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. నాయకత్వ స్థానాల్లో ఉంటూ సంస్థల ప్రగతిలో వారే నిర్ణేతలుగా ఉంటున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించిన నిజాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. దీంతో మన దక్షిణాది రాష్ట్రమే మహిళా సాధికారతలో ముందుండటం మనకే గర్వకారణం. దీంతో ఇంకా భవిష్యత్ లో స్త్రీలకు గౌరవ స్థానాలు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల పరంగా చూస్తే కర్ణాటక 28 శాతం, మహారాష్ట్ర 28 శాతం, తమిళనాడు 29 శాతం, మధ్యప్రదేశ్ 21 శాతం, రాజస్తాన్ 19 శాతాలతో నిలుస్తున్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. వారి పురోగతికి ప్రత్యేక స్థానం కేటాయిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. భవిష్యత్ లో కూడా మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. వారి పురోభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని సంస్కృతంలో చెబుతారు. అంతటి మహత్తర శక్తి కలిగిన అతివలకు అందలాలు ఇచ్చే క్రమంలో ఏపీ మరిన్ని రికార్డులు నెలకొల్పాలని మహిళలు ఆకాంక్షిస్తున్నారు.
Also Read:Current cuts: కరెంట్ కోతలైనా.. మరేదైనా.. వైసీపీది ఒకటే దారి..!
[…] Also Read: Women’s Empowerment: నిర్ణయాత్మక స్థానాల్లో మహిళ… […]
[…] Also Read: Women’s Empowerment: నిర్ణయాత్మక స్థానాల్లో మహిళ… […]