AP Politics: ఏపీ తిట్ల రాజకీయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో బోలెడు జోకులు పేలుతున్నాయి.. ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన ‘బోసిడీకే’ కామెంట్ అయితే తెగ వైరల్ అవుతోంది. ఇది బూతు కాదంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామతోపాటు టీడీపీ నేతలు నొక్కి వక్కాణించడంతో ఇది సోషల్ మీడియాలో నెటిజన్లకు పండుగలా మారింది. ట్రోలర్స్ టీడీపీ నేతలు, వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. బోసిడీకే బూతు కాదన్న టీడీపీ నేతలకు కౌంటర్ గా.. ఇక నుంచి నాన్న చంద్రబాబును లోకేష్ ‘బోసిడీకే నాన్నారూ’ అని పిలవచ్చని సెటైర్లు వేస్తున్నారు. ఇక ఏపీ బూతుల నేతల మాటలు టీవీల్లో విని చిన్న పిల్లలు ‘బోసిడీకే’.. ‘లం#%&కే’ అనే బూతు పదాలు తిట్టుకుంటున్నట్టుగా వినూత్న కార్టూన్లు, మీమ్స్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏపీ బూతు రాజకీయం తెగ హల్ చల్ చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులుగా రాజకీయం రగిలిపోతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధంతో మొదలై ఘర్షణ వాతావరణానికి తెరలేసింది. టీడీపీ నాయకుడు కొమ్మునేని పట్టాభి సీఎంపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు ఆగ్రహం చెందారు. ఆయన ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. అలాగే వివిధ జిల్లాల్లో ఉన్న టీడీపీ కార్యాలయాలపై స్థానిక వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం ముదిరిపోయింది. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ. ప్రతిపక్ష టీడీపీ అధినేత రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రాష్ట్రపతి పాలన విధించాలని కోరేందుకు ఢిల్లీ పయనమయ్యారు. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇలా బూతులు మాట్లాడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నాయకులు సైతం రాజధాని బాట పట్టారు. అసలు ఇంత వివాదం రాజుకోవడానికి కారణం ఏంటి..? ఇలాంటి తిట్ల దండకం ఇప్పుడే మొదలైందా..?
తాజాగా జరుగున్న గొడవలకు ప్రతిపక్ష టీడీపీ నాయకులనేనని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ ఈ ఉద్రిక్తతలకు గంజాయి కారణమని టీడీపీ నాయకులు అంటున్నారు. గుజరాత్లోని ముంద్రా రేవులో పట్టుబడ్డ గంజాయి కేసులో ఏపీ మూలాలు ఉండడం, అంతేకాకుండా ఎక్కడ గంజాయి పట్టుకున్న వాటితో ఇక్కడి సంబంధాలు ఉండడంతో రాష్ట్రంలో గంజాయి విపరీతంగా సాగు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు పట్టాభి కొంచెం ఎక్కువే బూతులు వాడారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ నాయకులు మాత్రం అధికారం లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర నిరాశగా ఉన్నారని.. దీంతో రాష్ట్రంలో అనవసరంగా ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్నారని అంటున్నారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు గంజాయి సాగు ఎక్కడా కనిపించలేదా..? అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగు చేసేవారిని ఎక్కడా పట్టుకోలేదంటున్నారు. కానీ ఇప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు టీడీపీ నాయకులు పట్టాభి ఇలా ముఖ్యమంత్రి పై చెప్పకోలేని పదాలు వాడడం కరెక్టేనా..? అని అంటున్నారు.
అయితే పట్టాభి వ్యాఖ్యలకు ఆయనపై చర్యలు తీసుకోవాలి. కానీ భౌతిక దాడులెందుకు..? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే అల్లర్లు సృష్టించి సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కుట్రలో భాగమే ఇదంతా.. అని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తోందని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఇలాంటి తిట్ల దండకం ఏపీ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. తెలుగు రాజకీయాల్లో బాగా పాపులర్ పొందిన తొలి బూతు పదం ‘కుక్కమూతి పిందెలు’అని ఎన్టీ రామారావు నాటి కాంగ్రెస్ నాయకులపై వాడారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎన్టీ రామారావుకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సందర్భంలోనే వాడారని, ఆ తరువాత మరోసారి ఇలాంటి పదప్రయోగం చేయలేదని కొందరు సీనియర్ రాజకీయ వేత్తలు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఇరు పక్షాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సంయమనం కోల్పోవద్దని కొందరు అంటున్నారు.
అంతకుముందు శ్రీకాళహస్తి ఉపఎన్నికలో కాంగ్రెస్ తరుపున బరిలో ఉన్న నీలం సంజీవరెడ్డిని ఓడించేందుకు కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రచారం చేశారు. రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి కానీ ఏనాడు తిట్ల విషయంలో హద్దులు దాటలేదు. ఒకవేళ పరుష వ్యాఖ్యలు చేసుకున్నా అవి అర్థవంతంగా ఉండేవని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
తాజాగా ఏపీ రాజకీయాల్లో వాడిన ‘బోసిడీకే’ పదం ఇప్పుడు వైరల్ అయ్యింది. దీన్ని రాజకీయ నాయకులు వివిధ అర్థాలు చెబుతుండడంతో నెటిజన్లు, వర్మ లాంటి వారు ఈ బూతు రాజకీయంపై సెటైర్లు, మీమ్స్ తో హోరెత్తిస్తున్నారు. ఏపీ బూతు రాజకీయం ఇప్పుడు యమ రంజుగా సాగుతోంది.