Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఒక మినీ ఇండస్ట్రీ అంటుంటారు. తోటి స్టార్ హీరోలు కూడా అక్షయ్ ను ఇండియన్ మూవీ మిషన్ అంటూ అతని పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఎందుకంటే, స్టార్ హీరోల్లో ప్రతి ఏడాది మూడు చిత్రాలకు పైగా విడుదల చేసే హీరో ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే. ప్రస్తుతం అభిషేక్ శర్మ దర్శకత్వంలో జాక్విలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి ‘రామ్ సేతు’ అనే సినిమా చేస్తున్నాడు.

‘రామ్ సేతు’ పేరులోనే ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఆధారంగా కొన్ని షాకింగ్ నిజాల మధ్యన నడవబోతున్న ఈ సినిమాలో తెలుగు యంగ్ హీరో సత్యదేవ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. పైగా సత్యదేవ్ క్యారెక్టర్ చాలా కీలకమైనది అట. అందుకే, అతని పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మధ్య తెలుగు కుర్ర హీరోలు బాలీవుడ్ పెద్ద హీరోలతో కలిసి నటిస్తున్నారు. చైతు ఇప్పటికే అమీర్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక ‘రామ్ సేతు’ విషయానికి వస్తే.. చిత్రబృందం ఊటీకి బై బై చెప్పేసింది. ఇటీవల ఊటీలో ఈ సినిమా ఇంటర్వెల్ పార్ట్ కు సంబంధించి కీలక షెడ్యూల్స్ మొదలయ్యాయి. అయితే, ఈ షెడ్యూల్ ముగిసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఓ చిన్నపాటి మెసేజ్ కూడా పెట్టాడు.
‘ఫోటోలో లేదా జీవితంలో చీకటి మేఘాలపై ఎప్పుడూ అందమైన కాంతిరేఖ ఉంటుంది’ అని ఒక మెసేజ్ తో పాటు జాక్వెలిన్, సత్యదేవ్‌తో కలిసి తాను దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అన్నట్టు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారు. కానీ ఇలాంటి సినిమాలు అక్షయ్ కి పెద్దగా కలిసి రాలేదు. మరి ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా ? సత్యదేవ్ కూడా పురావస్తు శాస్త్రవేత్తలోనే కనిపించబోతున్నాడు.
అక్షయ్ కుమార్ ఈ మధ్య ఎక్కువుగా తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తున్న భామలతో జతకడుతూ వస్తున్నాడు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా మూడు సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. అలాగే హోమ్లీ బ్యూటీ ప్రణీత సుభాష్ కు తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నాడు. ఏది ఏమైనా మూవీ మిషన్ నుంచి రామ సేతు లాంటి డిఫరెంట్ సినిమా రాబోతుంది.