ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావు జగన్..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరాల జల్లులలో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయినా పథకాల ప్రవాహం ఆగడం లేదు. ఆయన బటన్ నొక్కితే ఎదో ఒక వర్గం ఖాతాలలో నేరుగా డబ్బులు జమవుతున్నాయి. కొందరికైతే మరో ఏడాది రాకముందే పథకం రెండో విడత డబ్బులు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. మరి ఇంతలా ఆయన ప్రజలపై ప్రేమ కురిపిస్తుంటే… కొందరికి అది వెగటు వేస్తుందట. కొందరు ఏంటి […]

Written By: Neelambaram, Updated On : July 16, 2020 12:32 pm
Follow us on


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరాల జల్లులలో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయినా పథకాల ప్రవాహం ఆగడం లేదు. ఆయన బటన్ నొక్కితే ఎదో ఒక వర్గం ఖాతాలలో నేరుగా డబ్బులు జమవుతున్నాయి. కొందరికైతే మరో ఏడాది రాకముందే పథకం రెండో విడత డబ్బులు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. మరి ఇంతలా ఆయన ప్రజలపై ప్రేమ కురిపిస్తుంటే… కొందరికి అది వెగటు వేస్తుందట. కొందరు ఏంటి ఈయన డబ్బులు ఇలా పంచేస్తున్నారని అంటుంటే.. జగన్ జనాన్ని సోమరులను చేస్తున్నారని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. ఆ పెదవి విరిచినవారు కూడా పథకాలలో తమ కోటా తమకు అందినప్పుడు.. ఆహా జగన్, ఓహో జగన్ అంటున్నారు.

గొప్పల బాబు…మారేదెప్పుడు?

మరి వచ్చే ఐదేళ్లలో జగన్ సంక్షేమ పథకాల అమలులో ఇదే జోరు కనబరిస్తే…టీడీపీ మరియు జనసేన దుకాణాలు సర్దుకోవలసిందే. ప్రతిపక్ష హోదాలో బాబు ఎన్ని విమర్శలు చేసినా, ప్రత్యర్థిగా ఉన్న పవన్ ఎన్ని అవాకులు పేల్చినా జనం వారిని నమ్మడం, జగన్ పై నమ్మకం కోల్పోవడం కష్టమే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్పితే వాళ్లకు ఓటేసే వారు ఉండరు. అందుకే జగన్ ప్రతి పధకం అవినీతి మయమే అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు బాబు. ఇదిలా ఉంటే జగన్ సంక్షేమ పథకాల మైకంలో పడి కొన్నిసార్లు లాజిక్ ఫాలో కావడం లేదేమో అనిపిస్తుంది.

కరోనా బాధితుల కోసం జగన్ ప్రకటించిన ఓ స్కీమ్ అర్థం లేనిదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా బారినపడి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్న ప్రతి ఒక్కరికి జగన్, ప్రభుత్వం తరపున రూ. 2000 ఇవ్వడం జరుగుతుంది. తాజాగా కరోనా వలన మరణించి వారి అంతిమ సంస్కారాల కోసం రూ.15000 ఇవ్వవలసిందిగా జగన్ అధికారులను ఆదేశించింశారు. ఐతే కరోనా వలన మరణించిన వ్యక్తి శరీరం నుండి కూడా కరోనా వ్యాపిస్తుంది. దీనితో ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. వైద్య సిబ్బంది వారిని ఖననం చేయడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో అంతిమ సంస్కారాల కొరకు రూ. 15000 ఎందుకు అని అడుగుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఉద్దేశించిన ఆ డబ్బుని కుటుంబ సభ్యులకు గాని, వైద్య సిబ్బందికి గానీ ఇవ్వడం కుదరదు. మరి జగన్ ఈ పథకం ఏ ఉద్దేశంతో ప్రకటించారనేది సగటు పౌరుడి ప్రశ్న కూడా.