https://oktelugu.com/

AP – Telangana Election: ఏపీ, తెలంగాణ ఎన్నికలకు వేళాయే..

బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కడుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోనూ రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 10, 2023 / 11:21 AM IST
    Follow us on

    AP – Telangana Election: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది చివరితో పాటు వచ్చే ఏడాది దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ గడువు 2024 జవనరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్ 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు అక్టోబరు, నవంబరులో, ఏపీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే అంతకంటే ముందే చేయాల్సిన ఏర్పాట్లపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. =ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల జూలై 17, ఏపీఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబర్ 12 తరువాత దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

    తొమ్మిది రాష్ట్రాల్లో..
    ఈ ఏడాది చివరితో పాటు వచ్చే ఏడాదిలో తెలంగాణ, మిజోరం, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఒక వేళ ఏదైనా అసెంబ్లీ గడువు ముుందుగానే రద్ద అయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేసి అయిదు రోజుల ముందు వరకూ ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. దీని ద్వారా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కామన్ సింబల్ కోసం ఎన్ని పార్టీలు ముందుకొస్తాయో చూడాలి మరీ.

    హోరాహోరీ..
    ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పొలిటికల్ హీట్ నెలకొంది. ఏపీలో ఈ సారి ఎన్నికలు హోరా హోరీగా సాగనున్నాయి. అధికారం తిరిగి నిలబెట్టుకోవటం కోసం వైసీపీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో జత కడుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణలోనూ రాజకీయంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తోంది. అధికారం దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు ప్రారంభించడంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరిగే అవకాశముంది.