Homeఆంధ్రప్రదేశ్‌AP Govt: అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ.. చెల్లించే పరిస్థితి అయితే కనిపించడం లేదు!

AP Govt: అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ.. చెల్లించే పరిస్థితి అయితే కనిపించడం లేదు!

AP Govt: ఏపీ ప్రభుత్వం మరొక సారి తోపు అనిపించు కుంటుంది. ఎందుకో అనుకునేరు.. అప్పు కట్టమని బ్రతిమి లాడించు కోవడంతో కూడా ఏపీ ప్రభుత్వం కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ రాష్ట్రము అయినా కూడా బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవడం సహజం. అన్ని రాష్ట్రాలు తమకు అవసరమైన నిధులను బ్యాంకుల నుండి రుణంగా తీసుకుంటుంది. ఆ అప్పు సకాలంలో చెల్లించక పోతే బ్యాంకుల నుండి ఒత్తిడి తప్పదు.

AP Govt
AP Govt

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల నుండి భారీ గా అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పును మాత్రం సకాలంలో చెల్లించ లేదు. దీంతో బ్యాంకులను బ్రతిమి లాడించు కుంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం అప్పు కట్టాలని బతిమాలించు కునేది ఆషామాషీ బ్యాంక్ తో కాదు.. బ్యాంకులకే బ్యాంక్ అయినా ఆర్బీఐ నుండి అప్పు కట్టాలని బతిమాలించుకుని తోపు అని అనిపించు కుంటుంది.

బ్యాంకులకే బ్యాంక్ అయినా ఆర్బీఐ తో బతిమాలించు కోవడం అంటే తోపు అన్నట్టే లెక్క.. ఇక ఇప్పుడు ఆ లిస్టులో ఏపీ ప్రభుత్వం చేరి పోయింది. ఆర్బీఐ దగ్గర వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ల క్రింద చాలా అప్పులు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తీసుకోవాల్సిన అప్పులన్నీ తీసుకుంది కానీ తిరిగి చెల్లించడం లేదు. దీంతో ఆర్బీఐ ఏపీ ప్రభుత్వాన్ని బ్రతిమి లాడుతుంది.

Also Read: జగనన్న సంచులు కేరళలో అమ్మకానికి పెట్టారా? అసలు ట్విస్ట్ ఏంటి?

ఇంతకు ముందు ఏపీ ఖాతాలో జమ అయినా డబ్బును అప్పులకు జమ చేసుకునేది ఆర్బీఐ. కానీ ఇప్పుడు ఏపీ ఖాతాలో ఏమీ జమ కావడం లేదు. ఏపీ ప్రభుత్వం కేంద్రం నుండి రావాల్సిన పన్నుల వాటా ను ఈ నెలది కూడా గత నెలలోనే తీసుకున్నారు. మరొక వైపు బ్యాంకులో తీసుకున్న రుణాల గడువు కూడా ముగిసి పోయింది. మాములుగా ఓవర్ డ్రాఫ్ట్ ను పద్నాలుగు రోజుల్లో చెల్లించక పోతే దివాళా గా ప్రకటిస్తారు.

కానీ ఆర్బీఐ మాత్రం ఇప్పటికి లేఖలు రాస్తూ డబ్బులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతుంది. కానీ నగదు ఉంటే ఎదో విధంగా సర్బాటు చేసే అవకాశం ఉంది కానీ అసలు అలంటి పరిస్థితే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇలా చేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ మాత్రం దారుణంగా దెబ్బతింటుంది.. ఆ తర్వాత కొత్త అప్పులు పుట్టడం కూడా కష్టం అవుతుంది.. ఒక వేళ అప్పులు ఇచ్చిన అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.. ఇంత జరుగుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.. మరి ఏం చేస్తారో చూడాలి.

Also Read: ఏపీలో ఏకతాటిపైకి విపక్షాలు.. జగన్ లో పెరుగుతున్న భయం?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular