https://oktelugu.com/

AP Govt Key Decision On RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

AP Govt Key Decision On RRR Movie:  ఆంధ్రప్రదేశ్ లో సినిమాల వ్యవహారంలో కొనసాగుతున్న వివాదంతో పెద్ద సినిమాలకు నష్టాలు కలుగుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. దీంతో ఇటీవల పవన్ కల్యాన్ నటించిన భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇలాగే చేయడంతో పెద్ద రగడ రగిలినా పట్టించుకోలేదు. ఫలితంగా జీవో నెం. 13 సినిమా పరిశ్రమకు గుదిబండగా మారుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ మూవీపై కూడా ప్రభావం పడనుంది. ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 17, 2022 / 04:18 PM IST
    Follow us on

    AP Govt Key Decision On RRR Movie:  ఆంధ్రప్రదేశ్ లో సినిమాల వ్యవహారంలో కొనసాగుతున్న వివాదంతో పెద్ద సినిమాలకు నష్టాలు కలుగుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. దీంతో ఇటీవల పవన్ కల్యాన్ నటించిన భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇలాగే చేయడంతో పెద్ద రగడ రగిలినా పట్టించుకోలేదు. ఫలితంగా జీవో నెం. 13 సినిమా పరిశ్రమకు గుదిబండగా మారుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ మూవీపై కూడా ప్రభావం పడనుంది.

    AP Govt Key Decision On RRR Movie

    ఈ మేరకు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి టికెట్ ధరల పెంపుపై చర్చించారు. రూ. వంద కోట్లు దాటిన సినిమాల విషయంలో టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలియడంతో విడుదలైన పది రోజుల పాటు టికెట్ల ధరల పెంపుపై సినిమా నిర్మాతకు వెసులుబాటు ఉండటంతో ఈ మూవీకి నష్టాలు రాకుండా చూసుకునే క్రమంలో ఇది సాయపడుతుందని తెలుస్తోంది.

    Also Read: Actor Indraja: ఆమెను మరో రంగమ్మత్తను చేస్తావేంటి సుక్కు ?

    జీఎస్టీ, దర్శకుడు, నటీనటుల పారితోషికం ఆధారంగా చిత్రం రూ. 336 కోట్లు దాటడంతో దీని గురించి ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రం నష్టాల బారిన పడకుండా చూసేందుకు నిర్ణయం తీసుకుంటామని సంబంధిత మంత్రి ప్రకటించడంతో ఇక తేరుకున్నట్లే అని తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్ లో ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.

    AP Govt Key Decision On RRR Movie

    చిత్రబృందం విన్నపాలను పట్టించుకున్న ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ మూవీ గండాల నుంచి గట్టెక్కనుందని చెబుతున్నారు. ఇటీవల చిత్ర పెద్దలు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు చిత్ర పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏదిఏమైనా ఆర్ఆర్ఆర్ మూవీ నష్టాల బారి నుంచి బయటపడి లాభాల బాటలో పయనిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

    Also Read: ఆ విషయంలో వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాను – రాజమౌళి

    Tags