https://oktelugu.com/

Heroine Shocking Comments: స్టార్ హీరోల పై క్రేజీ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !

Heroine Shocking Comments: నాలుగేళ్ల క్రితం అవకాశాలు లేక చిన్నాచితకా యాడ్స్ కూడా చేసి నానా ఇబ్బందులు పడ్డ కృతీ సనన్‌, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. టైమ్‌ కలిసొస్తే.. అవకాశాలన్నీ అలాగే వస్తాయి. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. కాగా తాజాగా కృతీ మరో క్రేజీ చాన్స్‌ కొట్టేసింది. షారుఖ్ కొత్త సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, […]

Written By:
  • Shiva
  • , Updated On : March 17, 2022 / 05:05 PM IST
    Follow us on

    Heroine Shocking Comments: నాలుగేళ్ల క్రితం అవకాశాలు లేక చిన్నాచితకా యాడ్స్ కూడా చేసి నానా ఇబ్బందులు పడ్డ కృతీ సనన్‌, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. టైమ్‌ కలిసొస్తే.. అవకాశాలన్నీ అలాగే వస్తాయి. ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. కాగా తాజాగా కృతీ మరో క్రేజీ చాన్స్‌ కొట్టేసింది. షారుఖ్ కొత్త సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.

    Kriti Sanon

    అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ మాట్లాడుతూ.. ‘తమతో పాటు హీరోయిన్స్‌ కు సమ ప్రాధాన్యత, స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక హీరోయిన్‌కు 60 శాతం, హీరోకి 40 శాతం ఉన్న పాత్రలు చేసే పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో లేదు. అయితే అక్షయ్‌ కుమార్‌ కు ఎలాంటి అభద్రతాభావం లేదు.

    Also Read: Rajamouli Interesting Comments On Ram Gopal Varma: ఆ విషయంలో వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాను – రాజమౌళి

    అందుకే, ‘అత్రాంగి రే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు’ అంటూ కృతి అక్షయ్ ను తెగ పొగిడేసింది. తాజాగా అక్షయ్ కాంబినేషన్‌లో ఆమె నటించిన బచ్చన్ పాండే త్వరలో రిలీజ్ కానుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అంటే ఆమె ఖాతాలో ఇది మూడో పాన్ ఇండియా సినిమా అన్నమాట. అందుకే, ప్రజెంట్ పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ కృతీ మాత్రమే.

    Akshay Kumar

    కాగా హాలీవుడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌ ‘కిల్‌ బిల్‌’ హిందీ రీమేక్‌ లో కూడా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమాలో ఈ అవకాశం కోసం అలియా భట్ దగ్గర నుండి కియారా వరకూ అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అవకాశం మాత్రం కృతీకి దక్కింది. ఈ సినిమాలో కృతీ హీరోయిన్ గా నటించబోతుందనే సరికి ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

    నిర్మాత నిఖిల్‌ ద్వివేది నిర్మాణంలో రానున్న ఈ సినిమాని అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో హంతకులు ‘బిల్‌’ని, అతని మనుషులనూ చంపడమే ధ్యేయంగా ఇందులో కృతీ పాత్ర సాగుతుందట. మొత్తానికి హంతకుల పై పగబట్టిన భయంకరమైన మహిళగా కృతీ నటించబోతుంది.

    Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ

    Tags