Homeఎంటర్టైన్మెంట్Radhe Shyam Collections: ఫ్యాన్స్ భుజానికెత్తుకున్నా.. ప్రభాస్ అడ్డంగా దొరికిపోయాడు

Radhe Shyam Collections: ఫ్యాన్స్ భుజానికెత్తుకున్నా.. ప్రభాస్ అడ్డంగా దొరికిపోయాడు

Radhe Shyam Collections: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వాస్తవిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. మొత్తానికి ఈ లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు.

Radhe Shyam Collections
Radhe Shyam Collections

విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి తక్కువగా పడిపోయాయి. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ కు.. ఆ తర్వాత మూడో రోజు కలెక్షన్స్ కు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక ఆరో వచ్చే సరికి కలెక్షన్స్ దారుణాతి దారుణంగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో 7000 స్క్రీన్ లలో విడుదల అయినప్పటికీ.. గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే..

Also Read: Actor Indraja: ఆమెను మరో రంగమ్మత్తను చేస్తావేంటి సుక్కు ?

ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ 6 డేస్ కలెక్షన్స్ :

నైజాం 23.66 కోట్లు,

సీడెడ్ 07.16 కోట్లు,

ఉత్తరాంధ్ర 04.85 కోట్లు,

ఈస్ట్ 04.17 కోట్లు,

వెస్ట్ 03.21 కోట్లు,

గుంటూరు 04.32 కోట్లు,

కృష్ణా 02.56 కోట్లు,

నెల్లూరు 02.08 కోట్లు

ఏపీ మరియు తెలంగాణలో నిన్న వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 52.01 కోట్లు

తమిళ్ నాడు 0.77 కోట్లు,

కేరళ 0.34 కోట్లు,

కర్ణాటక 04.18 కోట్లు,

నార్త్ ఇండియా (హిందీ) 08.50 కోట్లు,

ఓవర్సీస్ 11.10 కోట్లు,

రెస్ట్ 04.11 కోట్లు,

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 81.01 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

Radhe Shyam Collections
Radhe Shyam Collections

‘రాధే శ్యామ్’కి దాదాపు 196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. 200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇప్పటివరకూ ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని గట్టిగా 81.01 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 118.99 కోట్ల షేర్ రావాలి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తిగా అసాధ్యం. మొత్తానికి రాధే శ్యామ్ పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా తయారైంది. లోకల్ గా రిలీజ్ అయిన ‘బాలయ్య’ అఖండ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’కి రాకపోవడం ప్రభాస్ అభిమానులకు అవమానకరమే.

Also Read:  ఆ విషయంలో వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాను – రాజమౌళి

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version