Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా గాడ్‌ఫాదర్. పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగనుంది ఈ సినిమా. మలయాలంలో సూపర్‌హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రైన హీరో సోదరిగా తెలుగులో నయనతార పోషించనుంది. తాజాగా, ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

కాగా, గాడ్‌ఫాదర్ సినిమాలో చిరుకు చెల్లెలిగా నటించేందుకు నయనతార భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.4 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతార పాత్ర కీలకంగా ఉండనుంది. గతంలో ఏ సినిమాలో లేని విధంగా ఇందులో పవర్ఫుల్ లుక్‌లో కనిపించనున్నారు.
గాడ్‌ఫాదర్ సినిమాను కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సత్యదేవ్ ఈ సినిమాలో ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన కనిపించనున్నట్లు టాక్. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ఇందులో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. చిరు ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. విడదలకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. వీరిద్దరూ మవోయిస్టు పాత్రల్లో కనిపించనున్నారు. రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డె నటిస్తోంది. ఇటీవలే విడుదలైన పాటలు, టీజర్లు ప్రేక్షకులను అలరించాయి. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.