AP Politics: ఏపీలో బలమైన ప్రత్యర్థుల మధ్య అంతే బలమైన కొట్లాట సాగుతోంది. తెలంగాణలో వన్ సైడ్ రాజకీయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రతిపక్షాలు బలంగా తయారవుతుండగా.. ఏపీలో మాత్రం అధికార వైసీపీ(YCP)ని మించి టీడీపీ(TDP) రాజకీయం చేస్తోంది. ఏపీలో తాజాగా మరోసారి పోలిటికల్ హీట్ రాజుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఓ సంఘటనతో పోలిటికల్ వార్ కు తెరలేచింది. ఎవరికీవారు ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎవరు తగ్గడం లేదు. ఇక పచ్చమీడియా ఇదే ఇష్యూను హైలెట్ చేస్తూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం ఆసక్తిని రేపుతోంది.
వైసీపీని ఎప్పుడు బాదానం చేసి పొలిటికల్ గేన్ సాధించాలని ఎదరుచూస్తున్న టీడీపికి ఇప్పుడు అవకాశం దక్కింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వెళ్లి నిరసన తెలుపేందుకు ప్రయత్నించారు. దీన్ని అవకాశంగా తీసుకున్న టీడీపీ నేతలు అక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు, అటూ టీడీపీ నేతలు ఒక్కచోట చేరడంతో అదికాస్తా వివాదంగా మారింది. అయితే ఇదంతా టీడీపీ రాజకీయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని ప్రతీఒక్కరు ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లి నిరసన తెలుపాలని ప్రయత్నించారు. ఆయన అయ్యన్నపాత్రుడు ఇంటి వద్దకు కాకుండా చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లడాన్ని టీడీపీ అవకాశంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది. వైసీపీ నేత చంద్రబాబుపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో అక్కడి చేరుకున్నారు.
జోగి రమేష్ తో టీడీపీ నేతలు వాగ్వావాదానికి దిగడంతో వైసీపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగి ఘర్షణకు దారితీసింది. ఇదే అదనుగా పచ్చమీడియా వైసీపీ ప్రభుత్వంపై పిచ్చికూతలు రాయలు మొదలెట్టింది. అసలు విషయాలను పక్కనబెట్టి టీడీపీకి పొలిటికల్ మైలేజీ కలిగించేలా వార్తలను వడ్డివర్చుతోంది. ఇదే సమయంలో వైసీపీ నేతలు అయన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా టీడీపీ నేతలు సైతం జోగి రమేష్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదే జోగి రమేష్ గతంలో వైసీపీ ఎంపీ రఘురామ రాజు విషయంలో సీఎం జగన్ చేత ప్రశంసలు దక్కించుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా రఘురామ అసలు బండారాన్ని బయటిపెట్టారు. ముఖ్యమంత్రిపై రఘురామ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టడంతోపాటు ఓ రేంజులో ఫైరయ్యారు. ఇదే సమయంలో ఆయనపై ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే రికార్డులను తొలగించాలని కోరారు. దీంతో ఆయన వ్యాఖ్యలు అందరినీ మెప్పించేలా ఉన్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి సైతం జోగి రమేష్ కు అప్పట్లో థ్యాంక్స్ చెప్పారనే టాక్ విన్పిస్తుంది.
అయితే అయన్నపాత్రుడు విషయంలో జోగి రమేష్ లెక్క తప్పినట్లు కన్పిస్తుంది. ముఖ్యమంత్రిపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వెళ్లడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే అదనుగా వైసీపీ నేతలు టీడీపీ ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలకు దిగింది. జోగి రమేష్ చంద్రబాబు ఇంటికెళ్లి నిరసన తెలుపడం వైసీపీ కంటే టీడీపీకే అడ్వాంటేజ్ గా మారింది. జోగి రమేష్ వ్యక్తిగత మైలేజ్ కారణంగా వైసీపీ ఇరుకున పడినట్లు కన్పిస్తుంది.
ప్రభుత్వం ఉండి ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు నిరసన తెలపడం ఏంటనే ప్రచారాన్ని టీడీపీ శ్రేణుల్లో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ అంశం టీడీపీకి కలిసి రానుండగా వైసీపీకి మాత్రం కొంత మైనస్ అయినట్లు కన్పిస్తుంది. అయితే వైసీపీ నేతలు సైతం టీడీపీ విమర్శలు ధీటుగా తిప్పికొడుతున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు ఇంటి కేంద్రంగా ఏపీలో మరోసారి రాజకీయ వేడి రాజుకున్నట్లే కన్పిస్తుంది.