Junior NTR- JanaSena: ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో అభిమానులు, అభిమాన సంఘాల మధ్య వార్ నడిచేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకూ అందరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఒకరి సినిమాకు మరొకరు క్లాప్ కొడుతున్నారు. ఆడియో ఫంక్షన్లకు, ఫ్రీ ప్రమోషన్లకు హాజరవుతున్నారు. సినిమా విజయవంతంగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు అభిమాన సంఘాల్లో సైతం చిచ్చు రేపుతున్నాయి. రచ్చకు కారణమవుతున్నాయి.
గత కొన్నాళ్లుగా నందమూరి అభిమానుల్లో అరమరికలు ఉన్నాయి. బాలక్రిష్ణ తో జూనియర్ ఎన్టీఆర్ కు పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. అటు రాజకీయంగా చంద్రబాబు, లోకేష్ లతో ఎన్టీఆర్ కు విభేదాలున్నాయన్న ప్రచారం ఉంది. దీంతో నందమూరి అభిమానుల నుంచి జూనియర్ అభిమానులు వేరుపడ్డారు. ఇటీవల హెల్త్ యూనివర్సిటీ ఇష్యూలో జూనియర్ స్పందించిన తీరుతో అడ్డుగీత మరింత పెరిగిపోయింది. నందమూరి వర్సెస్ ఎన్టీఆర్ అభిమానులు అన్నట్టు పరిస్థితి మారిపోయింది. పరస్పరం కత్తులు దూసుకునే స్థాయికి చేరుకుంది. నందమూరి హీరోలు స్పందికపోయినా అభిమానులు మాత్రం పరస్పరం దుమ్మెత్తిపోసుకునే వరకూ పరిస్థితి వచ్చింది.
Also Read: TDP- Jana Sena: పెరుగుతున్న జనసేన గ్రాఫ్.. ఓటు షేర్ పై టీడీపీలో కలవరం
అయితే జూనియర్ ఎన్టీఆర్ కు మెగా కాంపౌండ్ వాల్ హీరోలతో మంచి బాండింగే ఉండేది. ప్రత్యేకంగా చరణ్ తో అయితే విడదీయరాని బంధం ఉంది. మా స్నేహం చిరకాలం కొనసాగుతుందని కూడా చాలా సందర్భాల్లో ఇద్దరూ చెప్పుకొచ్చారు. అయితే మెగా హీరోలతో స్నేహంగా ఉండడం నందమూరి అభిమానులకు నచ్చడం లేదు. ఎలాగైనా ఎన్టీఆర్ ను విడదీయ్యాలని చూశారు. కానీ వారి పని సఫలం కాలేదు. ఇప్పుడు నందమూరి అభిమానుల నుంచి జూనియర్ అభిమానులు వేరు పడడంతో స్వతంత్రంగా ఎదగాలని భావిస్తున్నారు. మెగా కాంపౌండ్ వాల్ హీరోల అభిమానులతో సన్నిహితంగా మెలగడానికి నిర్ణయించారు.
అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను జనసేనలో చేరాలని.. కాకుంటే కనీసం సపోర్టు చేయాలని అభిమానులు సూచిస్తున్నారుట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు, జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. జూనియర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ హాజరయ్యారు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పట్లో కలిసినప్పుడు వారి మధ్య సినీ, రాజకీయాల గురించి చర్చ వచ్చింది. అప్పటి నుంచి వారు సన్నిహితంగానేఉంటున్నారన్న టాక్ అయితే ఉంది. ఇప్పుడు నందమూరి అభిమానుల నుంచి ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో తటస్థంగా ఉండే కంటే జనసేనకు మద్దతు తెలపాలని జూనియర్ కు అభిమానుల నుంచి ఒత్తిడి వస్తోందట. చూడాలి మరి జూనియర్ ఎలా స్పందిస్తారో.
Also Read: Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’: అసలు కథేంటి? ఎవరు ఏ పాత్రలు పోషించారంటే?