TDP- Jana Sena: పెరుగుతున్న జనసేన గ్రాఫ్.. ఓటు షేర్ పై టీడీపీలో కలవరం

TDP- Jana Sena: గత ఎన్నికల్లో ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ కనుమరుగవుతారని అంతా భావించారు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేస్తారని కూడా ప్రచారం చేశారు. కానీ పవన్ మాత్రం మొండిగా నిలబడ్డారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అధికార పక్షంగా వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నాయి. అటు ఒక్కస్థానానికే పరిమితమైన జనసేనను చూసి చాలా తక్కువగా చూశారు. కానీ అనూహ్యంగా జనసేన గ్రాఫ్ పెరుగుతుండడంతో అటు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం […]

Written By: Dharma, Updated On : September 27, 2022 11:42 am
Follow us on

TDP- Jana Sena: గత ఎన్నికల్లో ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ కనుమరుగవుతారని అంతా భావించారు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేస్తారని కూడా ప్రచారం చేశారు. కానీ పవన్ మాత్రం మొండిగా నిలబడ్డారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అధికార పక్షంగా వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉన్నాయి. అటు ఒక్కస్థానానికే పరిమితమైన జనసేనను చూసి చాలా తక్కువగా చూశారు. కానీ అనూహ్యంగా జనసేన గ్రాఫ్ పెరుగుతుండడంతో అటు అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కలవరపాటుకు గురవుతోంది. ప్రజా సమస్యలనే అజెండాగా తీసుకొని పోరాడుతుండడం, సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం జనసేన గ్రాఫ్ పెరగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 లో వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ అని భావించిన వారందరూ షాక్ కు గురయ్యేలా జనసేన కూడా ప్రధాన రాజకీయపక్షంగా నిలబడుతుండడం విశేషం.

pawan kalyan, chandrababu

వైసీపీ, టీడీపీ నాయకులు కూడా జనసేన వైపు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆ రెండు పార్టీల్లో ఇమడలేని వారు, తటస్థులు, మేధావులు పవన్ తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నారు. జనసేన ప్రభావం అంతంతమాత్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. జనసేన శ్రేణులతో పాటు పవన్ అభిమానులు, మెగా అభిమానులు, అటు సామాజికవర్గపరంగా కాపులు, ఇతర బీసీ కులాల బలం తోడైతే మాత్రం జనసేన బలీయమైన శక్తిగా ఎదగడం ఖాయం. రాష్ట్ర వ్యాప్తంగా పోటీచేసే ఆలోచన ఉన్నా.. పవన్ మాత్రం బలమైన స్థానాల నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు.తద్వారా కింగ్ మేకర్ కావాలని వ్యూహం పన్నుతున్నారు. అందుకే ప్రస్తుతానికి పొత్తుల ఆలోచన చేయడం లేదు. అటు బీజేపీ కలిసి రాకపోయినా ఒంటరిగా పోటీచేసైనా గౌరవప్రదమైన సీట్లు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

Also Read: Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’: అసలు కథేంటి? ఎవరు ఏ పాత్రలు పోషించారంటే?

pawan kalyan, chandrababu

అయితే జనసేన బలం పెరుగుతుండడం అధికార పార్టీతో పాటు టీడీపీకి వణుకు పుట్టిస్తోంది. ప్రజా వ్యతిరేక ఓటు షేర్ టీడీపీ నుంచి జనసేన ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోంది. అందుకే ఆయన జాగ్రత్తపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి నడిచేందుకే మొగ్గుచూపుతున్నారు. కానీ ఎన్నికల నాటికి పవన్ మరింత పుంజుకుంటే మాత్రం ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు పవన్ అడిగిన సీట్లు ఇవ్వకపోతే జనసేన ఒంటరి పోరు ఖాయం. అప్పుడు టీడీపీకి డ్యామేజ్ ఖాయం. అందుకే పవన్ వ్యూహాత్మకంగా జనసేన బలం పెంచుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గాల రివ్యూ చేస్తున్నారు. పార్టీకి బలమున్న నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. ఎన్నికల నాటికి నిర్ధిష్ట నియోజకవర్గాలను టార్గెట్ చేసుకోనున్నారు. ఒంటరిగా వెళ్లినా.. పొత్తులతో ముందుకు సాగినా ఎన్నికల తరువాత కింగ్ మేకర్ కావాలని పవన్ భావిస్తున్నారు. మొత్తానికైతే జనసేన గ్రాఫ్ పెరగడంతో ఇతర రాజకీయ పక్షాలు మాత్రం భయపడుతున్నాయి.

Also Read: Sharmila- Jagan: జగన్ తో ఈ విషయంలో షర్మిళ ఎందుకు విభేదించినట్టు?

Tags