https://oktelugu.com/

పోలీసులపై దాడి కాదంట.. మసాజ్‌ చేశారట..: విశాఖ పోలీసుల వివరణ

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎంతలా అంటే అధికార, ప్రతిపక్షాలు దాడులు చేసుకునే వరకూ దారితీస్తున్నాయి. అంతేకాదు.. ఓ వర్గం వారు పోలీసులపై దాడికి తెగబడడం ఇప్పుడు వివాదమైంది. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసుపైకి వైసీపీ కార్యకర్తలు వెళ్లగా.. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. అక్కడి పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. రామకృష్ణబాబు కార్యాలయంపై దాడి చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులపై ఎదురుదాడి చేశారు. ఆ దృశ్యాలు, ఫోటోలు సోషల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 3:43 pm
    Follow us on

    AP police
    ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎంతలా అంటే అధికార, ప్రతిపక్షాలు దాడులు చేసుకునే వరకూ దారితీస్తున్నాయి. అంతేకాదు.. ఓ వర్గం వారు పోలీసులపై దాడికి తెగబడడం ఇప్పుడు వివాదమైంది. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసుపైకి వైసీపీ కార్యకర్తలు వెళ్లగా.. ఆ సమయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడికి దిగారు. అక్కడి పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. రామకృష్ణబాబు కార్యాలయంపై దాడి చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న పోలీసులపై ఎదురుదాడి చేశారు. ఆ దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Also Read: సీఎం జగన్ కు సినీ ప్రముఖుల ప్రశంసల వెల్లువ !

    దీంతో వైసీపీ కార్యకర్తలు హద్దులు దాటిపోతున్నారని.. పోలీసులను సైతం లెక్క చేయడం లేదన్న విమర్శలు వచ్చాయి. అయితే అనూహ్యంగా.. ఏపీ పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లోనూ దీనిపై ప్రతిస్పందన వచ్చింది. పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయలేదని.. పోలీసు కింద పడితే పైకి లేపి మసాజ్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో పోలీసులు ఇచ్చిన వివరణ చూసి.. సోషల్ మీడియాలో సెటైర్లు ప్రారంభమయ్యాయి.

    అసలు వెలగపూడి రామకృష్ణబాబు ఆఫీసు దగ్గర ఏం జరిగిందో.. మొత్తం వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారు. టీడీపీ నేత నారా లోకేష్ కూడా పోలీసులను నెట్టేస్తున్న వైసీపీ కార్యకర్తల వీడియోలను పోస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తన్నించుకుని.. బాడీ మసాజ్ చేయించుకున్నామని చెప్పుకోవడం ఏమిటని.. మళ్లీ దానికి ఫ్యాక్ట్ చెక్ పేరుతో సమర్థించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి కాళ్ల దగ్గర పెట్టవద్దని ఆయన సూచించారు.

    Also Read: నల్లపిల్లి ఇంట్లో ఉంటే కోట్ల రూపాయలు.. నిజమేనా..?

    కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారని పొన్నూరులో దళిత టీడీపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నారా లోకేష్‌ పోలీసులపై మండిపడ్డారు. అప్పుడు కూడా గుంటూరు అర్బన్ ఎస్పీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీసీ విజువల్స్ బయట పెట్టాలని లోకేష్ సవాల్ చేశారు. తర్వాత పోలీసులు మాట మార్చారు. ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించామని చెప్పారు. ఇప్పుడు.. తమపై దాడి చేసినా మసాజ్ చేశారని చెప్పుకుంటూ పోలీసుల అధికారిక సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు.. వైసీపీ నేతలు ఏం చేసినా మసాజ్ చేశారని సరి పెట్టుకుంటారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనతో మరోసారి పోలీసులు వివాదంలో చిక్కుకున్నట్లైంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్