https://oktelugu.com/

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు.. మళ్లీ ప్రేమలో పడిందట..!

తమిళ నటి వనిత.. హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ అనుకున్నంతగా రాణించలేదు. ఆమె వ్యక్తిగత జీవితమే ఆమెకు అంతకంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టింది. వనిత త‌మిళ సీనియ‌ర్ న‌టుడు విజ‌య్‌కుమార్‌, న‌టి మంజుల దంప‌తుల పెద్ద కూతురు. ఇప్పటికీ వనిత అదే ట్రెండ్ కొన‌సాగిస్తోంది. తాను ఫ‌లానా సినిమానో, సీరియ‌ల్‌లో చేస్తున్నాన‌ని ఆమె ప్రక‌టించిన దాఖ‌లాలు లేవు. Also Read: రౌడీ పొలిటీషియన్ గా పవన్… షాకిస్తున్న స్టోరీ లైన్? పెళ్లి.. ప్రేమ.. కుటుంబ గొడవలంటూ చాలా సార్లు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 19, 2020 / 03:56 PM IST
    Follow us on


    తమిళ నటి వనిత.. హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినప్పటికీ అనుకున్నంతగా రాణించలేదు. ఆమె వ్యక్తిగత జీవితమే ఆమెకు అంతకంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టింది. వనిత త‌మిళ సీనియ‌ర్ న‌టుడు విజ‌య్‌కుమార్‌, న‌టి మంజుల దంప‌తుల పెద్ద కూతురు. ఇప్పటికీ వనిత అదే ట్రెండ్ కొన‌సాగిస్తోంది. తాను ఫ‌లానా సినిమానో, సీరియ‌ల్‌లో చేస్తున్నాన‌ని ఆమె ప్రక‌టించిన దాఖ‌లాలు లేవు.

    Also Read: రౌడీ పొలిటీషియన్ గా పవన్… షాకిస్తున్న స్టోరీ లైన్?

    పెళ్లి.. ప్రేమ.. కుటుంబ గొడవలంటూ చాలా సార్లు ఆమె వార్తల్లో నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ట్విట్టర్‌‌ వేదికగా మరో బాంబు పేల్చింది వనిత. మళ్లీ ప్రేమలో పడ్డానని ఆమె ప్రకటించడం పెద్ద వార్త అయింది. ఎందుకంటే ఇప్పటికే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో పీట‌ర్‌పాల్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల‌కే వాళ్లిద్దరి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఆ త‌ర్వాత స‌ర్దుకున్నట్టు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రకటించింది.

    Also Read: సీఎం జగన్ కు సినీ ప్రముఖుల ప్రశంసల వెల్లువ !

    అయితే.. అంతా సాఫీగా సాగుతుంద‌నుకుంటున్న స‌మయంలో .. తాజాగా ట్విట్టర్‌‌ వేదికగా మరోసారి ప్రేమను పంచుకోవడం ఆసక్తిగా మారింది. ఇంత‌కు ఆమె ఎవ‌రి ప్రేమ‌లో పడిందనేది ఇప్పుడు చర్చలా మారింది. పీట‌ర్‌తో విభేదాలు స‌మ‌సిపోయి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఆమె చెప్పాలనుకుందా..? లేక అతనితో బెడిసికొట్టి కొత్త ప్రేమాయణం ఏమైనా మొదలు పెట్టిందా అనేది నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా మరోసారి ఆమె ట్విట్టర్‌‌ వేదికగా స్పందిస్తేనే అసలు విషయం తెలిసేది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్