https://oktelugu.com/

నల్లపిల్లి ఇంట్లో ఉంటే కోట్ల రూపాయలు.. నిజమేనా..?

దేశంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. పేపర్లు, న్యూస్ ఛానెళ్లు, వెబ్ మీడియా ఎప్పటికప్పుడు మోసాలను వెలుగులోకి తెస్తున్నా మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ కొత్త తరహా మోసాలు చేస్తున్నారు. ఈ మోసగాళ్ల బారిన పడి అమాయకులైన చాలామంది లక్షల రూపాయలు నష్టపోతున్నారు. డబ్బు ఆశ చూపి మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. Also Read: 2021 సంవత్సరంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా..? తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మోసగాళ్లు నల్లపిల్లి ఉంటే కోట్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2020 / 03:36 PM IST
    Follow us on


    దేశంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. పేపర్లు, న్యూస్ ఛానెళ్లు, వెబ్ మీడియా ఎప్పటికప్పుడు మోసాలను వెలుగులోకి తెస్తున్నా మోసగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తూ కొత్త తరహా మోసాలు చేస్తున్నారు. ఈ మోసగాళ్ల బారిన పడి అమాయకులైన చాలామంది లక్షల రూపాయలు నష్టపోతున్నారు. డబ్బు ఆశ చూపి మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం.

    Also Read: 2021 సంవత్సరంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా..?

    తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మోసగాళ్లు నల్లపిల్లి ఉంటే కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. నల్ల పిల్లులు ఉంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయాతారంటూ ఆశ చూపుతున్నారు. దీంతో జిల్లాలో చాలామంది నల్ల పిల్లి కోసం వెతుకుతున్నారు. వీరి మాటలు నమ్మి ఎవరైనా నల్ల పిల్లి ఉందని చెబితే వారికి మాయమాటలు చెప్పి డబ్బులను దోచేస్తున్నారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన మోసం మోసగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

    Also Read: పాస్ వర్డ్స్ తరచూ మరిచిపోతున్నారా.. ఈ పని చేస్తే సమస్యకు చెక్..?

    ఈ మోసగాళ్లు శ్రీకాకుళం జిల్లాతో మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలను సైతం టార్గెట్ చేశారని తెలుస్తోంది. సాధారణంగా నల్లపిల్లి ఎదురొస్తే అశుభం అని ప్రజలు భావిస్తారు. మోసగాళ్లు, కార్లు, ఖరీదైన ద్విచక్ర వాహనాలలో తిరుగుతూ మాయమాటలు చెబుతూ ఉండటంతో ఎవరికీ అనుమానం కలగట్లేదు. విజయనగరం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వీరి మాయమాటలు నమ్మి 25 లక్షల రూపాయలు మోసపోయాడు. శ్రీకాకుళంలోని టెక్కలి, పాలకొండ, పలాస గ్రామల్లో వీళ్లు ఎక్కువగా తిరుగుతున్నారని తెలుస్తోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    పోలీసులు ప్రజలు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటివరకు ఐతే మోసాల గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెబుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.