వారి ఆశలన్నీ గల్లంతే..!

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కూడా కాలేదు. 20 నెలలు మాత్రమే అవుతోంది. కానీ.. అప్పుడే ప్రతిపక్ష నేతలో మాత్రం ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలు. అప్పుడే జగన్‌ ప్రభుత్వానికి ఏదో జరిగిపోతోందంటూ.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ చెబుతుంటారు. కానీ.. ఎంత చెప్పుకున్నా.. ఏం చేసినా ఏపీలో ఇప్పటికప్పుడు రాజకీయంగా పెద్ద మార్పులు ఉండవనేది స్పష్టం. ఏపీలో సంక్షేమ రథం క్షేమంగా ముందుకు సాగుతోంది. తాయిలాలు, రాయితీలు అందుకుంటున్న వారు ఇప్పుడే ఈ సర్కార్‌‌ను […]

Written By: Srinivas, Updated On : February 19, 2021 1:36 pm
Follow us on


ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కూడా కాలేదు. 20 నెలలు మాత్రమే అవుతోంది. కానీ.. అప్పుడే ప్రతిపక్ష నేతలో మాత్రం ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహలు. అప్పుడే జగన్‌ ప్రభుత్వానికి ఏదో జరిగిపోతోందంటూ.. తామే అధికారంలోకి రాబోతున్నామంటూ చెబుతుంటారు. కానీ.. ఎంత చెప్పుకున్నా.. ఏం చేసినా ఏపీలో ఇప్పటికప్పుడు రాజకీయంగా పెద్ద మార్పులు ఉండవనేది స్పష్టం. ఏపీలో సంక్షేమ రథం క్షేమంగా ముందుకు సాగుతోంది. తాయిలాలు, రాయితీలు అందుకుంటున్న వారు ఇప్పుడే ఈ సర్కార్‌‌ను వద్దనుకునే పరిస్థితి లేదు.

Also Read: బీజేపీకి పరీక్షలా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఇక మరో మూడేళ్లపాటు వైసీపీయే అధికారంలో ఉంటుంది. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. ఇలాంటి ఆలోచనల వల్ల ఏపీలో విపక్ష బలం లోకల్ బాడీ ఎన్నికల్లో హఠాత్తుగా పెరిగిపోతుందని ఎవరైనా అనుకుంటారు. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ టీడీపీనే చెప్పుకోవాలి. తాము గట్టి ఆల్టర్నేట్‌ అని ఎంతగా జబ్బలు చర్చుకున్నా బీజేపీ జనసేనకు పెద్దగా అవకాశం అయితే లేదు. వైసీపీ వీక్ అయిన చోట కచ్చితంగా టీడీపీకే ఆ ఓటు పడుతుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే గత‌ ఎన్నికల వేళ 23 సీట్ల దగ్గర ఆగిపోయింది. దాంతో ఈ ఎన్నికల్లో కొంత అయినా బలం పెరిగినా తమకు ఉనికి ఉంటుంది అని ఆశపడుతోంది.

ఇక బీజేపీ–జనసేన కూటమికి లోకల్ బాడీ ఎన్నికలు చాలా ఇబ్బందే అని చెప్పాలి. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వేరు. అక్కడ పార్టీ గుర్తులు ఉంటాయి. పైగా జనాలు క్యాండిడేట్లు, పార్టీలను చూసి ఓట్లు వేస్తారు. కానీ.. లోకల్ బాడీ ఎన్నికలు అంటే పూర్తిగా క్యాడర్ మీదే ఆధారపడి ఉంటాయి. బూత్ లెవెల్ వరకూ ఏ పార్టీకి క్యాడర్ బాగా ఉంటుందో ఆ పార్టీకే విజయాలు దక్కుతాయి. అలా చూస్తే బీజేపీ జనసేలకు క్షేత్రస్థాయిలో పెద్దగా క్యాడర్‌‌ లేదు. ఆది ఆ రెండు పార్టీలకు తెలిసిన విషయమే. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వస్తే అది తిరుపతి ఉప ఎన్నికల మీద కూడా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు.

Also Read: హైకోర్టు లాయర్ల హత్య వెనుక బిట్టు శీను.. నిందితుడు టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ మేనల్లుడు?

ఏపీలో ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ పని అయిపోయింది. 2024 ఎన్నికల్లో వచ్చేది తామే అంటూ బీజేపీ–జనసేన నేతలు ఇప్పటిదాకా జబ్బలు చరుస్తూ వస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు తిరుపతి బై పోల్ జరిగి కాస్త ఊపు వస్తే ఆ ప్రభావంతో ఇతర పార్టీల నుంచి నాయకులు వారితోపాటు క్యాడర్ కూడా వచ్చి చేరే సీన్ ఉండేది. అప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎంతో కొంత ఈ కూటమికి మేలు జరిగేది. కానీ.. ఇప్పుడు అంతా రివర్స్‌ అయింది. లోకల్ బాడీ అరకొర సీట్లు తెచ్చుకుంటే కనుక ఈ కూటమికి అది భారీ షాక్ అనే చెప్పాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్