https://oktelugu.com/

ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 132 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం బుధవారం రాత్రి పది గంటల అనంతరం 21 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, […]

Written By: , Updated On : April 2, 2020 / 11:49 AM IST
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 132 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం బుధవారం రాత్రి పది గంటల అనంతరం 21 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇంతవరకు మరణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరోవైపు వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారికి సన్నిహితంగా ఉన్న వారు ఉన్నవారు 104 కు ఫోన్ చేయడం లేక సమీపంలోని ఆశ వర్కర్లు, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్ కు వారి సమాచారం ఇస్తే వైద్యులు ఇంటికి వచ్చే పరీక్షలు చేస్తారని చెప్పారు. సీఎస్ నీలం సాహ్ని గురువారం ఉదయం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.