https://oktelugu.com/

AP MPs: ఏపీ ఎంపీలు వాళ్లను చూసైనా నేర్చుకోండయ్యా..!

AP MPs: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తుంది. తెలంగాణలో వరుసగా రెండుస్లార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో మాత్రం ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణ మధ్య  అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోకుండానే ఉన్నాయి. కేంద్రం పరిష్కరించాల్సిన విభజన సమస్యలు చాలావరకు పెండింగ్ లోనే ఉన్నాయి. కేంద్రం తీరుపై మాత్రం రెండు రాష్ట్రాల ఎంపీలు విభిన్నంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీతో అవసరానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2021 / 04:18 PM IST
    Follow us on

    AP MPs: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తుంది. తెలంగాణలో వరుసగా రెండుస్లార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో మాత్రం ఒకసారి టీడీపీ, మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణ మధ్య  అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోకుండానే ఉన్నాయి. కేంద్రం పరిష్కరించాల్సిన విభజన సమస్యలు చాలావరకు పెండింగ్ లోనే ఉన్నాయి. కేంద్రం తీరుపై మాత్రం రెండు రాష్ట్రాల ఎంపీలు విభిన్నంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

    AP MPs

    తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీతో అవసరానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ పనులు చేయించుకుంటున్నారు. ఒకసారి బీజేపీ సర్కారు తీరును ఎండగడితే మరోసారి మోదీని ప్రశంసలతో ముంచెత్తుతారు. కేంద్ర పరిధిలోని తెలంగాణ సమస్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకుంటే మాత్రం సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అవసరమైతే కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమేననే సంకేతాలు పంపిస్తారు.

    తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ తెలంగాణలో ఎంపీలు అదే వైఖరి అవలంభిస్తుంటారు. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలోనూ తెలంగాణ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మీ వైఖరేంటో చెప్పాలంటూ శీతాకాల పార్లమెంట్ సమావేశాలను హీటెక్కిస్తున్నారు.

    ప్లకార్డులతో సభను స్తంభించడమే కాకుండా ప్రశ్నోత్తరాలతో కేంద్ర మంత్రులను నిలదీస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు ఒకే అంశంపై నిలదీస్తూ కేంద్రాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైనప్పుడు వాకౌట్ చేస్తూ ప్రజల సమస్యలపై తమ చిత్తశుద్దిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఏపీ ఎంపీలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సమస్యలు లేవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

    ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో కేంద్రాన్ని ఎంపీలు నిలదీసే ఛాన్స్ ఉన్నా వారంతా పార్లమెంటులో మిన్నకుండిపోతున్నారు. వీరంతా కేవలం ప్రశ్నలకు మాత్రమే పరిమితం అవుతుండటంతో సమస్యలపై ఎలా స్పందించాలో తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోండయ్యా అంటూ ఏపీవాసులు చురకలంటిస్తున్నారు.

    Also Read: పేదలపైనే రుణం.. ఓటీఎస్ తో భారం

    ఆంధప్రదేశ్ ఎంపీలకు కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రశ్నలే దొరకడం లేదా? అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీలు పార్లమెంటులోనూ అలానే వ్యవహరిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీసేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీకి దమ్ము చాలడం లేదని ఏపీ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరంతా తమ స్వప్రయోజనాల కోసమే కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

    జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులకు సీఎం పదవీ ఉంటే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని పలువురు అంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరిలో ఎవరు సీఎం అయినా బీజేపీ నష్టమేమీ లేదని ఆ పార్టీ భావిస్తోంది.  దీంతో కేంద్రంలోని బీజేపీ సైతం ఏపీ సమస్యలపై పెద్దగా ఫోకస్ చేయకుండా దాటవేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎంపీలు సైతం తుతుమంత్రంగా పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

    Also Read: అప్పుల కుప్పలో పీఆర్సీ అమలయ్యేనా..?

    Tags