https://oktelugu.com/

AP Movie Tickets Issue: సొమ్ము నిర్మాతలదీ.. టికెట్లు ఏపీ సర్కార్ వా?

AP Movie Tickets Issue: సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. కష్టపడి సినిమాలు తీసేది నిర్మాతలైతే వాటి ఫలితాలు మాత్రం ప్రభుత్వం ఆపాదించుకోవడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను తమ వెబ్ సైట్ ద్వారా మాత్రమే అమ్మేలా చట్టం తీసుకురావడంతో ఆ జీవోపై సందేహాలు వస్తున్నాయి. సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం. అందులో ప్రభుత్వ జోక్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని అడుగుతున్నారు. టికెట్లు విక్రయించే అవకాశం ప్రభుత్వం […]

Written By: , Updated On : September 9, 2021 / 05:41 PM IST
Follow us on

AP Movie Tickets Issue

AP Movie Tickets Issue: సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. కష్టపడి సినిమాలు తీసేది నిర్మాతలైతే వాటి ఫలితాలు మాత్రం ప్రభుత్వం ఆపాదించుకోవడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లను తమ వెబ్ సైట్ ద్వారా మాత్రమే అమ్మేలా చట్టం తీసుకురావడంతో ఆ జీవోపై సందేహాలు వస్తున్నాయి. సినిమా అనేది ప్రైవేటు వ్యాపారం. అందులో ప్రభుత్వ జోక్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని అడుగుతున్నారు.

టికెట్లు విక్రయించే అవకాశం ప్రభుత్వం తమ దగ్గర పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల సంపాదనపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. పోర్టల్ నిర్వహించేందుకు సంపాదనలో వాటాలు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు టికెట్ల విక్రయంపై ఆన్ లైన్ పద్ధతులు ప్రవేశపెట్టినా ప్రభుత్వం కొత్తగా చేసేదేమిటని అందరిలో ఆగ్రహం కలుగుతోంది. ప్రభుత్వం కావాలనే ఏదో ఉద్దేశంతో సినీ పరిశ్రమను సాధించాలనే ఇలా చేస్తోందని ఆరోపణలున్నాయి.

ప్రైవేటు వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యంపై అందరిలో ఆగ్రహం పెరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఇలా సినిమా వ్యాపారంపై తమ పలుకుబడి ఉపయోగించడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళితే కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యకరమే. దీనిపై నిర్మాతలు అంతా కలిసి తమ భవిస్యత్ దృష్ట్యా కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

అసంబద్ద జీవోలు విడుదల చేస్తూ తన చేతగాని తనాన్ని మరోసారి రుజువు చేస్తోంది. అనవసర విషయాల్లో తలదూర్చి బ్లాక్ మెయిల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏ కొందరికో ప్రయోజనం చేకూర్చాలని అందరిని బాధ్యులను చేస్తే ఎలా ఊరుకుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై అందరిలో సందేహాలు వస్తున్నాయి. దీనిపై పరిశ్రమ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాల్లో జోక్యం చేసుకోవడం ప్రభుత్వానికి సరైంది కాదు. కానీ ప్రభుత్వం ఇలా చేయడంతో ఎవరికి ప్రయోజనమో అర్థం కావడం లేదని తెలుస్తోంది. వైసీపీ నిర్ణయంతో సినీ ప్రముఖుల్లో ఆందోళన పెరుగుతోంది. టికెట్ల అమ్మకంలో ప్రభుత్వం పెత్తనం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. సంపాదన అంతా సినిమా వాళ్లది అయితే ఫలితం మాత్రం ప్రభుత్వానిదా అని తెలుస్తోంది.