పేకాట శిబిరం వెనుక మంత్రి?

రాష్ట్రంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు చట్ట వ్యతిరేక వ్యవహారాలకు పాల్పడుతుండటం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గోదాములో నిషేదిత గుట్కా తయారు చేస్తున్న విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని గోదామును లీజులు ఇచ్చనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక మంత్రి స్వగ్రామంలో ఆయన సోదరుడే పేకాట శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి పేకాట శిబిరం నిర్వహకులను అరెస్టు […]

Written By: Neelambaram, Updated On : August 29, 2020 12:07 pm
Follow us on


రాష్ట్రంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు, మంత్రులు చట్ట వ్యతిరేక వ్యవహారాలకు పాల్పడుతుండటం సర్వత్రాచర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిందట గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గోదాములో నిషేదిత గుట్కా తయారు చేస్తున్న విషయాన్ని పోలీసులు బయట పెట్టారు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని గోదామును లీజులు ఇచ్చనట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక మంత్రి స్వగ్రామంలో ఆయన సోదరుడే పేకాట శిభిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి పేకాట శిబిరం నిర్వహకులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేయడం విశేషం.

Also Read: అట్టడుగు స్థానంలో ఏపీ..! ఇలా ఉంటే కష్టమే జగన్

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం సొంత ఊరు చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామం. అయితే ఇక్కడ కొద్ది రోజులుగా ఇక్కడ భారీ స్థాయిలో పేకాట శిభిరాలు నిర్వహిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా అధికారిక అనుమతిలో నడుస్తున్న పేకాట క్లబ్ లు మూతబడ్డాయి. దీంతో పేకాట రాయుళ్లు పేకాట ఆడేందుకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న వారికి గుమ్మనూరు పేకాట శిబిరం గురించి తెలిసి అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడకు కేవలం రాష్ట్ర వాసులే కాదు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పేకాట రాయుళ్లు ఖరీదైన కార్లలో వస్తు పేకాట ఆడి వెళుతున్నట్లు తెలుస్తోంది.

కర్నూలు జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన జిల్లాల్లో రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 42,257 కేసులు నమోదవగా ఇప్పటికీ 6,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రతి రోజు 700 నుంచి 900 కొత్త కేసులు నమోదవుతున్న తరుణంలో ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తూ లాక్ డౌన్ నిబంధనలను నిర్వాహకులు ఉల్లంగించారు. పోలీసులు పేకాట శిబిరంపై దాడికి రాగా పేకాట శిబిరం నిర్వాహకులు, స్థానికులు కొందరు పోలీసులపై దాడి చేసే సమయంలో తాము మంత్రి అనుచరులమని చెప్పడం విశేషం. ఈ దాడిలో కానిస్టేబుల్ తోపాటు ఎస్ఐ సమీర్ బాషాకు గాయాలయ్యాయి.

Also Read: ‘రక్తపాత దినోత్సవం ఎఫెక్ట్’ : సాయి రెడ్డికి రక్త కన్నీరు తెప్పించింది

మరోవైపు మంత్రి గుమ్మనూరి జయరాం మాత్రం ఈ వ్యవహారంలో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించారు. మంత్రి స్వగ్రామంలో ఆయనకు తెలియకుండా ఈ తంతు జరుగుతుందా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసుల పేకాట శిబిరం వద్ద రూ.5.34 లక్షల నగదు, 35 కార్లు, 35 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించారు. పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టించింది. ఈ క్రమంలో 32 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి సోదరుడు ఉన్నట్లు సమాచారం.