రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

రాజాసింగ్.. తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే . ఆయన హిందుత్వ వాదంతోనే గెలిచారు. అదే హిందుత్వవాదంతో చెలరేగిపోతుంటారు.. ఎంఐఎం అంటేనే రాజాసింగ్ కు అస్సలు గిట్టదు. మున్సిపల్ ఎన్నికల్లో అదే ఎంఐఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ఎంఐఎంపై ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంటారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుసలాంలో జాతీయ జెండా ఎగురవేసి జనగణమన పాడాలని.. ఇద్దరు ఒవైసీ బ్రదర్స్ ఇకపై వందేమాతరమూ పాడాల్సిందేనని హెచ్చరికలు పంపేంతటి ధైర్యం రాజాసింగ్ కు ఉంది.. Also […]

Written By: NARESH, Updated On : August 29, 2020 12:32 pm
Follow us on


రాజాసింగ్.. తెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే . ఆయన హిందుత్వ వాదంతోనే గెలిచారు. అదే హిందుత్వవాదంతో చెలరేగిపోతుంటారు.. ఎంఐఎం అంటేనే రాజాసింగ్ కు అస్సలు గిట్టదు. మున్సిపల్ ఎన్నికల్లో అదే ఎంఐఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ఎంఐఎంపై ఇప్పటికీ విరుచుకుపడుతూనే ఉంటారు. ఎంఐఎం కేంద్ర కార్యాలయం దారుసలాంలో జాతీయ జెండా ఎగురవేసి జనగణమన పాడాలని.. ఇద్దరు ఒవైసీ బ్రదర్స్ ఇకపై వందేమాతరమూ పాడాల్సిందేనని హెచ్చరికలు పంపేంతటి ధైర్యం రాజాసింగ్ కు ఉంది..

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

పక్కా ముస్లిం వ్యతిరేకిగా ముద్రపడ్డ రాజాసింగ్ భద్రతకు ఇప్పుడు పెను ముప్పు వాటిల్లింది. ఆయన ఇటీవల పట్టుబడ్డ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో పేరు ఉండడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయనకు భద్రత పెంచుతున్నట్టు సిటీ కమిషనర్ అంజనీకుమార్ తాజాగా రాజాసింగ్ కు లేఖ రాశారు.

రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా బైక్ పై ర్యాలీలు చేయడం ఆయన అలవాటు. ఈ క్రమంలోనే ఆయనను ఉగ్రవాదులు చంపాలని ప్లాన్ చేశారని పోలీసుల విచారణలో తేలిందట.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ పైన తిరగవద్దంటూ హైదరాబాద్ కమిషనర్ రాజాసింగ్ ను లేఖలో తాజాగా కోరారు. బైక్ పైన తిరగడం రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు అని.. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ఉపయోగించాలని రాజాసింగ్ ను అంజనీకుమార్ అభ్యర్థించారు.

ఈ సందర్భంగా రాజాసింగ్ రక్షణ కోసం కత్తి లాంటి చురుకైన గన్ మెన్లను తాజాగా నియమించారు. ఆయన గన్ మెన్లకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ గన్ మెన్ లకు అత్యాధునిక కొత్త వెపన్స్ కూడా సమకూర్చారు.

ఇక అడిషనల్ డీసీపీ రాజాసింగ్ ఇంటివద్దకు వెళ్లి ఇంటి చుట్టుపక్కల ఎవరున్నారు.? గన్ షూటింగ్ కు అనుకూలంగా ఉందా అని సమీక్షించారు. ఆయన భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఇంటి వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అందరినీ ఆరాతీసి అందరి ఇళ్లను చెక్ చేశారు.

Also Read: కరోనా దెబ్బకు అప్పులపాలు అయిపోతారు : వైద్య శాఖ మంత్రి ఈటెల

ఇక రాజాసింగ్ తనకున్న భద్రతను సడన్ గా ఎందుకు పెంచారని.. తనకు ముప్పు ఉందని తెలిసినా గన్ లైసెన్స్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. ఎవరి నుంచి? ఎక్కడి నుంచి తనకు ప్రాణహాని ఉందో తెలుపాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రెండేళ్లు అయినా తనకు గన్ లైసైన్స్ ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్దారు. దీనిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానన్నారు.

అయితే హైదరాబాద్ లో ఇటీవల పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ లో ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వారు విధ్వంస రచనతోపాటు పలువురి హత్యకు కుట్రపన్నారని విచారణలో తేలింది. అందులో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేందుకు ప్లాన్ చేశారని తెలిసింది. దీంతోనే రాజాసింగ్ కు భద్రతను పోలీసులు పటిష్టం చేశారని ‘కాన్ఫిడెన్షియల్ లేఖ’లో పోలీసులు వివరించారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.