AP Minister Balineni Srinivas : ఏపీ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రష్యా పర్యటన తీవ్ర దుమారం రేపింది. ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించి ప్రైవేటు విమానంలో మంత్రి బాలినేని వెళ్లారని తెలుగుదేశం పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఆయనను హవాలా కింగ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా పర్యటన హాట్ టాపిక్ గా మారింది. ఇదో ప్రముఖ వార్తగా మీడియాలో నిలవడంతో.. దీనిపై బాలినేని స్పందించారు.
తాను తన మిత్రుడి పుట్టిన రోజు వేడకల్లో పాల్గొనేందుకు రష్యా వెళ్లినట్టు చెప్పిన మంత్రి.. రూ.5 కోట్లు ఖర్చు చేసి ప్రైవేటు విమానంలో వెళ్లాననడంలో నిజం లేదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించిన బాలినేని.. తన వెంట ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని తెలియగానే.. ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని విమర్శించారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రెండు నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు ప్రత్యేక విమానంలో మారిషస్ వెళ్లారని గుర్తు చేశారు. కేవలం రెండు ఎకరాల పొలం నుంచి వచ్చని వ్యక్తి ఇలా ప్రత్యేక విమానంలో ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ల్యాండ్‌సీలింగ్ లో వందల ఎకరాలు పోగొట్టుకున్న తాము మాత్రం ఏ పర్యటనకూ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు.
ఈ పర్యటన విషయమై ఎలాంటి దాపరికాలూ లేకుండా తానే సోషల్ మీడియాలో వెల్లడించినట్టు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేసినట్టు చెప్పారు. దొంగచాటుగా విదేశీ పర్యటనలకు వెళ్లల్సిన అవసరం తనకు లేదని అన్నారు. హవాలా కింగ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడితే, అసత్యాలు చెబితే ప్రజలు సహించబోరని అన్నారు మంత్రి బాలినేని.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ap minister balineni srinivasa reddy reacts on his russia tour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com