Modi-Chandrababu Meeting: ఏపీలో ఎన్నికలకు పట్టుమని 20 నెలల వ్యవధి లేదు. దీంతో అన్ని రాజకీయ పక్షాలు గట్టిప్రయత్నాలే మొదలు పెట్టాయి. వైసీపీ, టీడీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. అందుకే ఏ చిన్న రాజకీయ పరిణామం అయినా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకూ వైసీపీతో స్నేహంగా ఉంటూ వస్తున్న బీజేపీ సడన్ గా రూటు మార్చింది. చంద్రబాబుతో చేతులు కలిపిందన్న ప్రచారం నడుస్తోంది. దీనికి తగ్గట్టుగానే పరిణామాలు కూడా జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా దూరం పెట్టినా ఇటీవల మారిన పరిణామాలతో చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఆహ్వానాలు అందిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీతో చంద్రబాబు కలవడాన్ని ఏపీ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసే వేళతాయని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవమెంత అన్నది తెలియడం లేదు. జగన్ ను విడిచిపెట్టి చంద్రబాబుతో బీజేపీ కలిసి వెళుతుందన్న ప్రశ్నకు ప్రస్తుతమైతే సమాధానం దొరడకం లేదు. దీనిపై క్లారిటీ వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
జగన్ కలవరపాటు…
అయితే మోదీతో చంద్రబాబు కలవడం జగన్ ను కలవరపాటుకు గురిచేసిందా? అన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. సాధారణంగా రాజకీయ శత్రువు చంద్రబాబు కాబట్టి.. ప్రధాని మోదీ కలవడం జగన్ కు రుచించదన్నది సహజం. అంతమాత్రన ఇప్పటికిప్పుడు రెండు పార్టీలు కలిసిపోతాయన్నది మాత్రం అతియే అవుతోంది. వాస్తవ పరిస్థి మాత్రం వేరేలా ఉంది. బీజేపీ పెద్దలు అటు వైసీపీ, ఇటు టీడీపీని సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఎవరికి ప్రజాభిమానం ఉంటే వారితో వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయితే గతంలో చంద్రబాబు ఎన్డీఏకు దూరం కావడానికి బీజేపీ పెద్దలు కారణం కాదు. చంద్రబాబును వారు వెళ్లగొట్టలేదు. కేవలం విభజన హామీల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే చంద్రబాబు కటీఫ్ చెప్పారు. అయితే వైసీపీ ట్రాప్ లో పడడం వల్లే అప్పట్లో చంద్రబాబు దూరమయ్యారన్న టాక్ నడిచింది. తద్వారా చంద్రబాబుకు మైనస్ అయ్యింది. వైసీపీ లాభపడింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. బీజేపీకి టీడీపీ దగ్గరవుతోంది. కానీ వైసీపీ దూరమవుతుందా అన్నది తెలియడం లేదు.
Also Read: Chandrababu Naidu Delhi Tour: కేంద్ర పెద్దలతో చంద్రబాబును కలిపిందెవరు? రాయభారం నడిపిందెవరు?
వదులుకోవడం సాధ్యమేనా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను బీజేపీ దూరం చేసుకుంటుందా? అని కూడా చెప్పడం అసాధ్యం. అటు బీజేపీ వైసీపీని వదులుకుంటుందా? అని కూడా చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబుతో పోల్చుకుంటే రాజకీయంగా జగన్ బలంగా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా వైసీపీ బలం పెరుగుతోంది. 2028 వరకూ ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంటుంది. అటు సంక్షేమ పథకాల అమలుతో జగన్ తన గ్రాఫ్ ను పెంచుకున్నారు. ఏపీలో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం జగన్ తన పరపతిని పెంచుకున్నారు. అందుకే జగన్ ను బీజేపీ పెద్దలు వదులుకుంటారా? అన్నది ప్రశ్నార్థకమే.
బీజేపీ పెద్దల్లో అసంతృప్తి..
అదే సమయంలో బీజేపీకి కూడా దేశ వ్యాప్తంగా బలం పెరిగింది. మిత్రులతో పని లేకుండా పోయింది. మొన్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతు అభ్యర్థలు ఘన విజయం సాధించడమే ఇందుకు ఉదాహరణ. అయితే వైసీపీ విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత, రాజకీయ అంశాలకే ప్రాధాన్యిమిస్తున్నారన్న అపవాదు అయితే జగన్ పై ఉంది. ఈ విషయంలో కేంద్ర పెద్దలుకూడా అసంతృప్తిగా ఉన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనతో ఉన్నారు. దీంతో జగన్ పై వారికి అప నమ్మకం ఏర్పడుతోంది. అది మరింత ముదిరితే మాత్రం చంద్రబాబే మేలన్న భావనకు బీజేపీపెద్దలు వచ్చే అవకాశం ఉంది. అటు రాష్ట్రంలో బలపడాలన్న ఆకాంక్ష, మరో మిత్రపక్షం జనసేన ఒత్తడి, ఆర్ఎస్ఎస్ ప్రభావం వంటి కారణాలతో బీజేపీ చంద్రబాబుతో కలిసి నడిచే అవకాశం లేకపోలేదని కూడా విశ్లేషణలు వెలవడుతున్నాయి.
Also Read:KCR vs Modi: మోడీతో ఫైటింగ్: కేసీఆర్ మంచికా? చెడుకా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap looks towards delhi different stories on chandrababus meeting with prime minister
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com