RRR: అందుకే, రాజమౌళి చరణ్ ను హైలైట్ చేశాడు

RRR:  ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనంలో రామ్ చరణ్ ప్రభ వెలిగిపోతుంది. రామ్ చరణ్ గొప్ప నటుడు కాదు అన్నవారికి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఒక సమాధానం అయింది. జూ ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడ్నే కొన్ని సీన్స్ లో చరణ్ డామినేట్ చేసిన విధానం చరణ్ ఎంత గొప్ప నటుడో చెబుతుంది. ప్రతి స్టార్ హీరో కెరీర్ లో ఆ హీరో నటనా స్థాయిని మలుపు తిప్పే చిత్రం ఒకటుంటుంది. ఆ సినిమా ఆ హీరో స్థాయిని అమాంతం పెంచేస్తోంది. […]

Written By: Shiva, Updated On : March 25, 2022 5:39 pm
Follow us on

RRR:  ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనంలో రామ్ చరణ్ ప్రభ వెలిగిపోతుంది. రామ్ చరణ్ గొప్ప నటుడు కాదు అన్నవారికి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ఒక సమాధానం అయింది. జూ ఎన్టీఆర్ లాంటి బలమైన నటుడ్నే కొన్ని సీన్స్ లో చరణ్ డామినేట్ చేసిన విధానం చరణ్ ఎంత గొప్ప నటుడో చెబుతుంది. ప్రతి స్టార్ హీరో కెరీర్ లో ఆ హీరో నటనా స్థాయిని మలుపు తిప్పే చిత్రం ఒకటుంటుంది. ఆ సినిమా ఆ హీరో స్థాయిని అమాంతం పెంచేస్తోంది.

RRR

మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ మాదిరిగా.. ప్రభాస్ కి బాహుబలి మాదిరిగా.. మహేష్ పోకిరి, బన్నీకి పుష్ప మాదిరిగా, ఇప్పుడు చరణ్ కి ‘ఆర్ఆర్ఆర్’ అయ్యింది. రామరాజుగా రామ్ చరణ్ కనబరచిన నటన ఆశ్చర్యపరిచింది. అందుకే, చరణ్ సినిమాలన్నీ ఒక ఎత్తు… ‘ఆర్ఆర్ఆర్’ మరో ఎత్తు. ఇకపై చరణ్ సినీ కెరీర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ముందు… ఆ తర్వాత అని మాట్లాడుకుంటారు.

Also Read: ఆ ధరలను పెంచి.. ఈ ధరలపై పడ్డ కేసీఆర్.. ఇది మామూలు ప్లాన్ కాదయ్యో..

కారణం.. ఈ సినిమాలో రామచరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. సహజంగా మల్టీ స్టారర్ లో ఇద్దరు హీరోలు హైలైట్ అవుతారు. కానీ.. కొన్ని చోట్ల మెయిన్ గా క్లైమాక్స్ లో చరణ్ ఏకంగా ఎన్టీఆర్ నే డామినేట్ చేశాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందారు కూడా. ఎందుకు ? రాజమౌళి చరణ్ ను ఎక్కువ ఎలివేట్ చేశాడు ? అన్న అనుమానం కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కొంతమంది న్యూట్రల్ ప్రేక్షకులు అయితే.. చరణ్ ఈ సినిమా అంతా తనే ముందు ఉండి నడిపాడని కామెంట్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టు తన ఆహార్యంలో తన నటనలో చరణ్ తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా యాక్షన్ లో పూర్తిగా ఆకట్టుకున్నాడు. చరణ్ లో ఒక గొప్ప నటుడిని వెలికితీయగల సమర్ధవంతమైన దర్శకుడిగా రాజమౌళి పూర్తి క్రెడిట్ కొట్టేశాడు.

RRR

ఒక్కమాటలో రామ్ చరణ్ నట విశ్వరూపానికి ‘ఆర్ఆర్ఆర్’ ఒక తార్కాణం. అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి.. తాను పౌరాణిక పాత్రలతోనూ మెప్పించగలను అని చరణ్ నిరూపించుకున్నాడు.

Also Read: Naatu Naatu Song Copied: ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్స్ జక్కన్న అక్కడ నుంచి తీసుకున్నారా ?

Tags