https://oktelugu.com/

‘అమరావతి’పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతిని రాజధానిని చేశారు. అక్కడ జరిగిన అక్రమాలను పసిగట్టిన జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని పక్కనపెట్టింది..ఏపీలో మూడు రాజధానులను ప్రకటించారు. దీంతో అమరావతి వేదికగా ఉద్యమం రాజుకుంది. అక్కడి రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది అమరావతిలోనే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. Also Read: జగన్ కేంద్రంలో చేరితే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 / 09:33 AM IST

    amara

    Follow us on

    చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతిని రాజధానిని చేశారు. అక్కడ జరిగిన అక్రమాలను పసిగట్టిన జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని పక్కనపెట్టింది..ఏపీలో మూడు రాజధానులను ప్రకటించారు. దీంతో అమరావతి వేదికగా ఉద్యమం రాజుకుంది. అక్కడి రైతులు నిరాహార దీక్షకు దిగారు. ఏపీకి రాజధాని అంటూ ఉంటే అది అమరావతిలోనే ఉండాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా కొంతమంది రైతులు, మహిళలు అమరావతి ప్రాంతంలో ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: జగన్ కేంద్రంలో చేరితే పవన్ కళ్యాణ్ ఎక్కడ?

    ఇటు కేంద్రంతో వైసీపీ సర్కార్ ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతోంది. దీంతో ఏదో జరుగుతున్న ఫీలింగ్ ఏపీ రాజకీయాల్లో కలుగుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది.

    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ‘అమరావతి’ రాజధానిపై తాడోపేడో తేల్చడానికి రెడీ అయ్యింది,. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే ఏపీ ప్రభుత్వం, కేంద్రం, గవర్నర్ ఆమోదించిన మూడు రాజధానుల వ్యవహారం.. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇక నుంచి రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. అమరావతిపై స్టేటస్ కో విధించిన ఏపీ హైకోర్టు..దాఖలైన పిటీషన్ల సంఖ్య వాటి తీవ్రత ఆధారంగా రోజువారీ విచారణ జరిపేందుకు గత నెలలో అంగీకారం తెలిపింది.

    ఇవాళ్లి నుంచి ఏపీ హైకోర్టు అమరావతిపై విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే అన్ని వివరాలతో విచారణకు రావాలని పిటీషన్లతోపాటు ప్రతివాదులను ఆదేశించింది.

    Also Read: తిరుపతిలో పోటీకి భయపడుతున్న పార్టీలు

    కాగా ఈ కేసులో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము మూడు రాజధానులకు అనుకూలమని ఏపీ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. విపక్షాలు, టీడీపీ, అమరావతి రైతులు వ్యతిరేకమంటూ అఫిడవిట్లు వేశారు. హైకోర్టు రోజువారీ విచారణ చేయనుండడంతో ఏపీ ‘రాజధాని’ భవిష్యత్ ఏం కానుందనేది ఆసక్తిగా మారింది.