బయటకొస్తే చాలు కరోనా పట్టేసుకుంటోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్న వేళ.. తెలుగుసినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి సహా చాలా మంది ప్రముఖులు కరోనా బారినపడ్డారు. ఇటీవల స్టార్ హీరోయిన్ తమన్నా కూడా కరోనా బారినపడింది.
Also Read: కాజల్ అతడిపై మనసు పారేసుకుందా?
ఇటీవల తమన్నా తీవ్ర జ్వరం రావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా టెస్ట్ కూడా చేశారు. ఈ రిపోర్ట్ లో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతోంది. అయితే జ్వరం తగ్గడం.. ఇతర లక్షణాలు తగ్గిపోవడంతో వైద్యులు తమన్నాను ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది. హోం ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారని.. మందులు తీసుకుంటూ ఇంట్లోనే కరోనాకు చికిత్స తీసుకుంటానని తమన్నా తెలిపారు.
ఇటీవలే కొద్దిరోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు సైతం కరోనా సోకింది. అదే సమయంలో వారితో ఉన్న తమన్నా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. తాజాగా పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం తమన్నా గుర్తుందా శీతాకాలం, సిటీమార్, అంధధూన్ రీమేక్‌తో పాటు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది
Also Read: రాంగోపాల్ వర్మ నిజస్వరూపాన్ని బయటపెట్టిన నాగబాబు
కోట్లాది మందిని వణికిస్తున్న కరోనా సినీ సెలెబ్రెటీలను కూడా వదలడం లేదు. ఇటీవలే ప్రముఖ హీరోయిన్ తమన్నాతో చాలా మంది సినీ సెలెబ్రెటీలకు కరోనా సోకింది. దీంతో సినిమా షూటింగ్ లు చేయడం కత్తిమీద సాములా మారింది. షూటింగ్ లపై ఇండస్ట్రీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.