https://oktelugu.com/

శిరోముండనం కేసు: నిందితుల అరెస్ట్ ను నిలిపేస్తూ హైకోర్టు సంచలనం

తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నాయకులకు గొప్ప ఊరట లభించినట్టైంది. Also Read: జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు! వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతడి అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 11:21 am
    Follow us on

    తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరంలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతల అరెస్ట్ సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ నాయకులకు గొప్ప ఊరట లభించినట్టైంది.

    Also Read: జగన్ ను ఢీకొంటున్న ఒకే ఒక్కడు ఇతడు!

    వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతడి అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఈ కేసుపై రాష్ట్రపతి కూడా స్పందించి సామాజికన్యాయశాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    కాగా ఈ కేసులో బాధితుడు ప్రసాద్ చెప్పేవన్నీ అబద్దాలు అని ప్రమాదంలో గాయపడ్డ విజయ్ బాబు వెల్లడించాడు. దీంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి అక్టోబర్ 5కు వాయిదా వేసింది.

    ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్రపతి కూడా సీరియస్ అయ్యి విచారణ చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ సర్కార్ కూడా దీనిపై సీరియస్ గా ముందుకెళుతోంది.

    తాజాగా ఈ శిరోముండనం కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఆరుగురు నిందితులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. బాధితుడి వ్యవహారశైలిపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేశారు.

    Also Read: బాబుకు షాక్.. అమరావతిపై జగన్ సీబీ‘ఐ’!

    ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలంటూ బాధితుడు వరప్రసాద్ కు హైకోర్టు నోటీసులుజారీ చేసింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ట్రైనీ ఎస్ఐ ఫిరోషాతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.