https://oktelugu.com/

నటి శ్రావణి ఆత్మహత్య.. వెనుక షాకింగ్ విషయాలు

ప్రముఖ టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ప్రముఖ సీరియల్ లో శ్రావణి నటిస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ లో తన నివాసంలో రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి ఆత్మహత్యకు ప్రేమనే కారణంగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే ! శ్రావణి 8 ఏళ్లుగా తెలుగు టాప్ సీరియల్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 9, 2020 / 10:58 AM IST
    Follow us on

    tv actor sravani

    ప్రముఖ టెలివిజన్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. ప్రముఖ సీరియల్ లో శ్రావణి నటిస్తోంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మధురానగర్ లో తన నివాసంలో రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

    శ్రావణి ఆత్మహత్యకు ప్రేమనే కారణంగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.

    Also Read: బాలయ్య ఆర్డర్.. ఇష్టం లేకపోయినా చేయాల్సిందే !

    శ్రావణి 8 ఏళ్లుగా తెలుగు టాప్ సీరియల్స్ లో నటిస్తోంది. మౌనరాగం, మనసు మమత లాంటి ఈటీవీ సీరియల్స్ లో రాణిస్తోంది. ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన ఓ యువకుడితో టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత యువకుడి నుంచి వేధిపులు మొదలయ్యాయి. అతడి నిజస్వరూపం తెలిసి శ్రావణి దూరం పెట్టింది.

    డబ్బులు ఇవ్వాలని లేకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని ఆ యువకుడు బెదిరించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రూ.లక్ష ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని యువకుడు చెప్పడంతో విడతల వారీగా శ్రావణి పంపింది. డబ్బులు ఇచ్చినా వేధింపులు ఆపకపోవడంతో శ్రావణి జూన్ 22న ఎస్ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

    Also Read: ఆమె ఓ స్ఫూర్తి.. కానీ ఆమెకు కూడా వేధింపులా ?

    పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.