Jagananna Vidya Deevena scheme: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడం తెలిసిందే. మళ్లీ మహిళా పంచాయతీ కార్యదర్శులను పోలీస్ కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీవో పై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరోమారు జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. జగనన్న విద్యాదీవెన పథకంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ నిర్ణయం తప్పిదమని కొట్టివేసింది. దీంతో జగన్ సర్కారుకు కోర్టులో వ్యతిరేకతలే వస్తున్నాయి.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం స్థానంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. దీంతో ఫీజు కళాశాల యాజమాన్యాలకు కాకుండా తల్లిదండ్రుల ఖాతాల్లోకే వెళుతున్నాయి. దీంతో వారు తమ స్వార్థానికే ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా కాలేజీలు సమస్యల్లో చిక్కుకున్నాయి. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను తల్లుల ఖాతాల్లో వేస్తే కాలేజీల యాజమాన్యాలకు అందడం లేదు. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కూడా వారి వాదనను అంగీకరించింది. ఇకపై కాలేజీలకే నేరుగా నిధులు ఇవ్వాలని తేల్చింది. దీంతో ప్రభుత్వానికి మరోమారు ఎదురుదెబ్బ తగిలింది.
Also Read: Pawan Kalyan: కేంద్రాన్ని పవన్ ప్రశ్నించాలంట.. మరి వైసీపీ ఏం చేస్తున్నట్టు..?
అయినా ప్రభుత్వానికి కోర్టులో ఎదురు దెబ్బలు తగలడం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు అన్ని కేసుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలా జరగం కొత్తేమీ కాదని తెలుస్తోంది. తల్లుల ఖాతాల్లో వేస్తే తమకు అందడం లేదని చెబుుతున్నారు దీంతోనే నేరుగా కాలేజీల ఖాతాల్లోనే వేయాలని సూచించింది. ప్రభుత్వ వాదనలను కొట్టివేసింది.
Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పార్టీలకు తలనొప్పిగా మారనుందా?