
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు ఊరటల మీద ఊరటలు ఇస్తోంది. అధికారులను పబ్లిక్ గా బెదిరించడం.. ఎస్ఈసీని అసభ్యకరంగా తిట్టడం చేస్తున్నాడని ఆయనపై ఈనెల 21వ తేదీ వరకు గృహ నిర్బంధం, మీడియాతో మాట్లడకూడదనే ఆంక్షలను ఎస్ఈసీ విధించారు. అయితే ఆయనకు హైకోర్టు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. మొదటగా సింగిల్ జడ్జి గృహ నిర్బంధాన్ని తొలగించారు. మిగితా ఆంక్షలను ఉంచారు.
Also Read: షర్మిల రిటర్న్.. గులాబీ నేతల్లో టెన్షన్..?
అయితే మీడియాతో మాట్లాడకుంటే.. తన వాక్ స్వాతంత్యాన్ని హరించినట్లేనని భావించిన పెద్దిరెడ్డి.. డివిజన్ బెంచ్ కు వెళ్లారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన ఫిటిషన్ ను పరిశీలించింది. మీడియాతో మాట్లాడొచ్చిని ఆదేశించింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డను మాత్రం వ్యక్తిగతంగా దూషించడం లాంటి పనులు చేయవద్దని .. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. హై కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి రోజూ మీడియా ముందుకు వస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నానా రకాలుగా తిడుతున్నారు.
చివరికి ఆయనను తన ఇంట్లోని దొడ్డిలో ఉండే పశువులతో సమానం అని కూడా తేల్చేశారు. అంతేకాదు.. ఆయనకు జైలు శిక్ష వేస్తానని పదవీవిమరణ చేసిన తరువాత అంతకంతకు అనుభవిస్తారని హెచ్చరికలు జారీ చేశారు. ఇవన్నీ ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు పోయారు. అందుకే హైకోర్టు అతడికి నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించవద్దని ఆదేశిస్తూ.. మీడియాతో మాట్లాడేలా ఆదేశాలు ఇచ్చింది.
Also Read: గ్రేటర్ పీఠంపై కమలం కన్ను.. !
ఎన్నికలు నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించడం తప్ప పెద్దిరెడ్డి పెద్దగా మీడియా ముందు మాట్లాడేది ఏమీ ఉండదు. ఆయన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైతే పెద్దిరెడ్డి.. కొద్దికొద్దిగా నిమ్మగడ్డ ఇచ్చిన ఆంక్షల నుంచి రిలీవ్ తెచ్చుకున్నారు. వీటిని ఉల్లంఘిస్తే.. నిమ్మగడ్డ మళ్లీ హై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ గవర్నర్ ఇటీవల రెండు వర్గాలతో విడివిడిగా మాట్లాడారు. దాంతో ఇక ముందు వివాదాలు రావన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్