https://oktelugu.com/

ఆదాయం పెంచుకునేందుకు ఏపీ సర్కార్‌‌ కొత్త ‘దారులు’

ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలనే అన్వేషిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజల నుంచి ఆదాయం దండుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కొండంత అప్పులతో జగన్‌ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. కనీసం రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చలేని దుస్థితిలో ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోతోంది. దీంతో ప్రజల నుంచి డబ్బులు లాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 12:11 PM IST
    Follow us on

    ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలనే అన్వేషిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజల నుంచి ఆదాయం దండుకోవాలని చూస్తోంది. ఇప్పటికే కొండంత అప్పులతో జగన్‌ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. కనీసం రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చలేని దుస్థితిలో ఉంది. ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేకపోతోంది. దీంతో ప్రజల నుంచి డబ్బులు లాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఇందులో భాగంగా ఇకపై ఏపీ ప్రజలపై పన్నుల భారం మోపేందుకు రెడీ అవుతోంది. ఇందులో ముఖ్యంగా రెండు మార్గలను ఎంచుకుంది. ఒకటి ఏపీలో డబుల్ లైన్ రోడ్లన్నింటికీ టోల్ వసూలు చేయడం.. రెండోది ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్న వసూలు చేయడం. ప్రస్తుతం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఏపీలో రాష్ట్ర రహదారులకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. డబుల్ లైన్ ఉన్న ప్రతీ రోడ్డుకి టోల్ పెట్టాలని డిసైడయ్యారు. ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఓ టోల్ గేట్ ఉంటుంది. ప్రజల పన్నులతో కట్టే రోడ్లను వాహనాలు కొనేటప్పుడు.. లైఫ్ ట్యాక్స్‌లు కట్టి మరీ రోడ్లను ఉపయోగించుకోవడానికి మరోసారి టోల్ టాక్స్‌లు కట్టాల్సిన పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడబోతోంది. రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ప్రజల టోల్ తీయాలనే నిర్ణయించుకుంది.

    Also Read: ఆంధ్రులూ.. తెగించాల్సిన టైం వచ్చింది!

    మరోవైపు ఆస్తి పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించేందుకు సిద్ధమవుతోంది. ఎప్పుడో 30 ఏళ్ల కిందట 3 లక్షలు పెట్టి ఇల్లు కొంటే.. ఇప్పుడు అది 3 కోట్లు అవ్వొచ్చు. ఇప్పుడు రూ.3 కోట్ల ఆస్తికి కాబట్టి ఏడాదికి రూ.30వేల టాక్స్ విధించొచ్చు..! రూ. 30 వేలే ఉండాలనేం లేదు.. ప్రభుత్వం ఎంత ఆదాయం పొందాలనుకుంటే అంత నిర్ణయిస్తుంది. అయితే నిర్ణయం తీసుకున్నారు కానీ అమలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే చేస్తారని తెలుస్తోంది.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పసుపు పార్టీ కనిపిస్తుందా..?

    మొత్తానికి ప్రభుత్వం ఇప్పటి వరకు పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసినా.. ఇప్పుడు వాటిని పన్నుల రూపంలో రిటర్న్‌ లాక్కునేలా ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ స్కీంతో ఎంత లబ్ధిపొందారో తెలియదు కానీ.. ప్రభుత్వం అనుకుంటున్న ఈ టోల్‌టాక్స్‌, ఆస్తి పన్ను వసూలు అమల్లోకి తెస్తే అందరిపైనా భారం పడే ప్రమాదమే ఉంది.