https://oktelugu.com/

బిగ్ బాస్-4: లాస్య నవ్వుల వెనుక తీవ్ర విషాదం..! 

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. అయితే గత సీజన్ల కంటే భిన్నంగా బిగ్ బాస్-4 సీజన్ నడుస్తోంది. ఈసారి బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టులు పెద్దగా సెలబ్రెటీలు కాకపోవడంతో ప్రేక్షకులు తొలినాళ్లలో ఈ షోపై కొంత నిరుత్సాహం చూపారు. అయితే క్రమంలో బిగ్ బాస్ అలరించే టాస్కులు పెడుతుండటంతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ బిగ్ బాస్-4 ప్రస్తుతం తొమ్మిదో వారంలో కొనసాగుతుండగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 12:17 PM IST
    Follow us on


    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ కొనసాగుతోంది. అయితే గత సీజన్ల కంటే భిన్నంగా బిగ్ బాస్-4 సీజన్ నడుస్తోంది. ఈసారి బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టులు పెద్దగా సెలబ్రెటీలు కాకపోవడంతో ప్రేక్షకులు తొలినాళ్లలో ఈ షోపై కొంత నిరుత్సాహం చూపారు. అయితే క్రమంలో బిగ్ బాస్ అలరించే టాస్కులు పెడుతుండటంతో ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బిగ్ బాస్-4 ప్రస్తుతం తొమ్మిదో వారంలో కొనసాగుతుండగా గురువారం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సమాజం కోసం వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనలు ఇంటి సభ్యులతో పంచుకోవాలని బిగ్ బాస్ కోరాడు. దీనిలో భాగంగా యాంకర్ లాస్య తనన జీవితంలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని తీవ్ర విషాదాన్ని వెల్లడించి కన్నీటి పర్యాంతమైంది.

    యాంకర్ లాస్య ఒకే వ్యక్తిని రెండు సార్లు వివాహం చేసుకుంది. అంతేకాకుండా తన ప్రెగ్నెన్సీని కుటుంబ సభ్యులకు తెలియకుండా తీయించుకుంది. ఇందుకు కారణాలను ఆమె బిగ్ బాస్ వెల్లడించింది. 2010లోనే తాను లవ్ మ్యారేజీ చేసుకున్నట్లు తెలిపింది. ఆ సమయంలో తమ పెళ్లికి ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వేరుగా ఉన్నట్లు చెప్పింది. 2012 నుంచి మళ్లీ కలిసి ఉన్నామని తెలిపింది.

    Also Read: వైల్డ్ డాగ్ టీంకు గుడ్ బై చెప్పిన నాగ్..!

    2014లో తమ నాన్న ఫోన్ చేసి తనకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపింది. నువ్వు పెళ్లి చేసుకున్నావనే విషయం కుటుంబంలో ఎవరికీ తెలియదని.. ముందు మీరు సెటిల్ అవండి.. నేను మీకు పెళ్లి చేస్తానని చెప్పడంతో తనకు సంతోషం కలిగిందని చెప్పింది. అయితే కొద్దిరోజులకే ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి వెళితే తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిందని చెప్పింది.

    ఇది తనకు సంతోషం కలిగించే విషయమే అయినప్పటికీ తన భర్తతో రెండ్రోజులపాటు చర్చించి కడుపు తీయించుకున్నట్లు కన్నీటి పర్యంతమైంది. తన బిడ్డను తానే చంపుకున్నందుకు చాలా డిప్రెషన్ కు గురైనట్లు వాపోయింది. ఇక 2017లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నానని.. ఐదునెలల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యా.. కానీ మిస్ క్యారీ అయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

    Also Read: నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సైలంట్ వెనుక కారణలెంటీ?

    2018లో జిన్నుగాడు తన కడుపులో వచ్చిపడ్డటంతో తన జీవితంలోకి కొత్త వెలుగులు వచ్చినట్లు తెలిపింది. అయితే తాను కడుపు తీయించుకున్న విషయం తమ అమ్మనాన్నకు తెలియదని చెప్పింది. తాను తప్పుచేసినందుకు క్షమించండి అంటూ లాస్య కన్నీటి పర్యంతమైంది. చీమ.. ఏనుగు జోకులతో నిత్యం ప్రేక్షకులను నవ్వించే లాస్య జీవితంలో ఎవరికీ తెలియని ఎవరూ ఊహించని విషాదం ఉండటం శోచనీయంగా మారింది.