ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 219 మందితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో 18 మందికి ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. మరో 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశసింది. బడుగు బలహీన వర్గాలకు 61 శాతం పదువులు ఇచ్చారు. 50 ఉపకూలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, ఎస్టీలకు 3 శాతం మందికి బాధ్యతలు అప్పగించారు. మైనార్టీలకు 6 శాతం కొత్త కమిటీలో చోటు కల్పించారు. అలాగే రాష్ట్ర కమిటీలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.