https://oktelugu.com/

క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..!

డిసెంబర్ 25 ఏసుక్రీస్తు జన్మదినం. ఈరోజును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 25కు మరో వారంరోజుల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే అన్నిదేశాల్లోనూ క్రిస్మస్ సందడి మొదలైంది. క్రిస్మస్ వేడుకలను ఎవరి స్థోమతకు తగ్గటుగా వారు జరుపుకుంటారు. ఈ వేడుకుల్లో భాగంగా చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరిచడం.. ప్రార్థనలు చేయడం.. కొత్తబట్టలు ధరించడం.. క్రిస్మస్ కేకులు.. క్రిస్మస్ ట్రీ.. శాంటాక్లాజ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా కన్పింటాయి. Also Read: క్రిస్మస్ పండుగను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 / 01:11 PM IST
    Follow us on


    డిసెంబర్ 25 ఏసుక్రీస్తు జన్మదినం. ఈరోజును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 25కు మరో వారంరోజుల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే అన్నిదేశాల్లోనూ క్రిస్మస్ సందడి మొదలైంది.

    క్రిస్మస్ వేడుకలను ఎవరి స్థోమతకు తగ్గటుగా వారు జరుపుకుంటారు. ఈ వేడుకుల్లో భాగంగా చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరిచడం.. ప్రార్థనలు చేయడం.. కొత్తబట్టలు ధరించడం.. క్రిస్మస్ కేకులు.. క్రిస్మస్ ట్రీ.. శాంటాక్లాజ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా కన్పింటాయి.

    Also Read: క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

    అయితే క్రిస్మస్ ట్రీ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. ఏసుక్రీస్తుకు కానుకలు ముఖ్యం కాదని.. మంచి మనస్సుతో ప్రార్థిస్తే చాలు.. కరుణిస్తాడనే గొప్ప విషయాన్ని క్రిస్మస్ ట్రీ కథ అందరికీ చాటి చెబుతోంది. ఇక కథలోకి వెళ్తే..

    క్రీస్తు జన్మదినం రోజుకు అందరు చర్చికి వెళ్లడం.. రకరకాల బహుమతులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లోడి వద్ద ఏది కొనాలన్నా చేతిలో పైసలు ఉండవు. దీంతో అతడు ఏమి చేయాలో తోచక తన ఇంటిముందు ఓ అందమైన మొక్కను తీసి.. ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళుతాడు.

    అయితే అప్పటికే అక్కడికి చాలామంది ఎన్నో విలువైన కానుకలతో వస్తారు. వారంతా ప్లాబో తెచ్చిన పూలకుండీని చూసి ఎగతాళి చేస్తారు. దీంతో ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ వద్ద పెడుతాడు. అనుహ్యంగా ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది.

    Also Read: క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్‌ కేథడ్రల్‌

    దీంతో ఆ పేద బాలుడి తెచ్చిన కానుకే అందరి కంటే విలువైనది అవుతుంది. అప్పటి వరకు బాలుడిని ఎగతాళి చేసిన వారంతా సిగ్గుపడుతారు. దీంతో నాటి నుంచి ప్రతీయేటా ఏసు జన్మదిన వేడుకల్లో క్రిస్మస్ ట్రీ ఓ భాగమై పోయింది.

    ఇంకా చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ ట్రీపై స్టార్స్ పెట్టడం.. విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తుండం కన్పిస్తూ ఉంటోంది. మంచి మనస్సుతో ఏ చిన్న కానుక ఏసుక్రీస్తుకు ఇచ్చినా అది ఆయనకు విలువైనదేనని క్రిస్మస్ ట్రీ సంఘటన అందరికీ చాటిచెప్పింది.