Vizag Railway Zone: రైల్వే ప్రాజక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయమే జరుగుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అలాగే ఉండిపోయింది. దీంతో రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తంగానే ఉంది. పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రైల్వే వ్యవస్థ తీరుపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. విభజన హామీలు తుంగలో తొక్కిన ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా తరువాత పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ముఖ్యమైన రైల్వే వ్యవస్థ కానరావడం లేదు.దీంతోనే కొత్త లైన్ల ఏర్పాటు కూడా కొలిక్కి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లిస్తే నూతన ప్రాజెక్టులు చేపడతామని కేంద్రం ప్రకటిస్తుండటంతో రాష్ట్రం ప్రస్తుతం నిధులు సమకూర్చే స్థితిలో లేకపోవడం గమనార్హం.
Also Read: టీఆర్ఎస్ నేతలకు ప్రజాప్రయోజనాలు పట్టవా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూటి ప్రశ్న
దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం తనదైన శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైల్వే ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించే క్రమంలో ముందుకు నడవాల్సిన అవసరంఉందని సూచిస్తున్నారు.కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది.
విశాఖ రైల్వే జోన్ ప్రకటనకు కేంద్రం ఎందుకు సుముఖంగా లేదో అర్థం కావడం లేదు. రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తే కేంద్రం కూడా ముందుకు వస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్రం కూడా తన వంతు సహకారం అందిస్తేనే సాధ్యమవుతుందని తెలియదా అని ప్రశ్నలు వస్తున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న సందర్భంలో జగన్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: రోజాకు ఈసారైనా మంత్రి పదవి దక్కేనా? ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకుంటారా?