https://oktelugu.com/

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల కలెక్టరేట్లు ఇవే.. ఏ జిల్లా ఆఫీస్ ఎక్కడంటే?

AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నుంచే పరిపాలన నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ 4నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగించనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ భవనాలున్న చోట వాటిలో లేని చోట ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని పనులు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్తజిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. భవనాల కేటాయింపు సిబ్బంది నియమిస్తూ ముందుకు వెళ్తోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 4, 2022 11:32 am
    Follow us on

    AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల నుంచే పరిపాలన నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ 4నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగించనుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ భవనాలున్న చోట వాటిలో లేని చోట ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని పనులు చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

    AP New Districts

    కొత్తజిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. భవనాల కేటాయింపు సిబ్బంది నియమిస్తూ ముందుకు వెళ్తోంది. కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు తయారు చేసింది. అందులో నుంచే పరిపాలన నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త కార్యాలయాల కళ కనిపించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందడంతో ఇక పరిపాలనలో ముందుకు వెళ్తోంది.

    Also Read: Nara Chandrababu Naidu: ఏకతాటిపైకి ‘అన్న’గారి కుటుంబం… చంద్రబాబు ప్రయత్నం

    నేటి నుంచి అన్ని కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయి. అధికారులు, సిబ్బంది, ప్రజలు కార్యాలయాల్లో కనిపిస్తున్నారు. దీంతో ఆఫీసులు కళకళలాడుతున్నాయి. ఇక మీదట అన్ని కార్యాలయాల్లో ప్రజలు తమ పనులు నిర్వహించుకోవచ్చు. తమ విధులు నిర్వహించేందుకు సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నారు. దీంతో ఏ పని అయినా చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

    వచ్చే సంవత్సరం నాటికి కొత్త భవనాలు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. శాశ్వత భవనాలు నిర్మించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో వేగవంతం చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు ప్రణాళిక ప్రకారం వెళ్లనుందని చెబుతున్నారు.

    JAGAN

    శ్రీకాకుళం జిల్లా ఆఫీసు కొత్తపేట జంక్షన్, విజయనగరం జిల్లా కంటోన్ మెంట్, విశాఖపట్నం మహారాణిపేట, మన్యం పార్వతీపురం జిల్లా గిరిజన సంక్షేమ భవనం, అనకాపల్లి ఇండో అమెరికన్ ఇనిస్టిట్యూట్ , అల్లూరి సీతారామరాజు జిల్లా యూత్ ట్రైనింగ్ సెంటర్ పాడేరు, కాకినాడ పాత కలెక్టరేట్, కోనసీమ జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ కార్యాలయం, తూర్పుగోదావరి జిల్లా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్, ఏలూరు జిల్లా పాత కలెక్టరేట్ భవనం, పశ్చిమగోదావరి శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాల, కృష్ణా జిల్లా పాత కలెక్టరేట్ భవనం, ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం, గుంటూరు పాత కలెక్టరేట్ కార్యాలయం, బాపట్ల జిల్లా మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ప్రకాశం జిల్లా పాత కలెక్టర్ కార్యాలయం, పలనాడు జలవనరుల శాఖ కార్యాలయం, తిరుపతి పద్మావతి నిలయం, చిత్తూరు పాత కలెక్టర్ కార్యాలయం రెడ్డిగుంట, అన్నమయ్య ప్రభుత్వ భవనం, కడప కొత్త కలెక్టర్ కార్యాలయం, అనంతపురం పాత కలెక్టర్ కార్యాలయం, సత్యసాయి సత్యసాయి మిర్పూరి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, కర్నూలు కలెక్టర్ కార్యాలయం బుధవారపేట, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన భవనం నూనెపల్లిలో ప్రభుత్వకలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.

    Also Read:JD Laxminarayana: సీబీఐ మాజీ జేడీ దారెటు?

    Tags