ఆ జిల్లాలో సరి, బేసి విధానం…!

కోవిడ్ – 19 కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో అక్కడి అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వాలు కాలుష్యం అధికమైనప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇది పోలి ఉంది. నిత్యావసరాలు నిమిత్తం మార్కెట్లు షాపులు ఇంక మీదట సరి సంఖ్య దినాలలో (2,4,6,8,10,12,14,16,18,20, 22,24,26,28,30 తేదీలలో)పనిచేస్తాయని, బేస్ సంఖ్య దినాలలో(1,3,5,7,9,11,13, 15,17,19,21,23,25,27,29,31 తేదీలలో) మార్కెట్లు, షాపులు ఉండవని గుంటూరు అర్బన్ పోలీసు అధికారి డిఐజి […]

Written By: Neelambaram, Updated On : April 14, 2020 12:51 pm
Follow us on


కోవిడ్ – 19 కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో అక్కడి అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వాలు కాలుష్యం అధికమైనప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇది పోలి ఉంది. నిత్యావసరాలు నిమిత్తం మార్కెట్లు షాపులు ఇంక మీదట సరి సంఖ్య దినాలలో (2,4,6,8,10,12,14,16,18,20, 22,24,26,28,30 తేదీలలో)పనిచేస్తాయని, బేస్ సంఖ్య దినాలలో(1,3,5,7,9,11,13, 15,17,19,21,23,25,27,29,31 తేదీలలో) మార్కెట్లు, షాపులు ఉండవని గుంటూరు అర్బన్ పోలీసు అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలిపారు. ప్రజలందరూ గమనించి ఈ రోజు 14 వ తారీఖున సరి సంఖ్య అయినందున మార్కెట్, షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తీసి ఉంటాయని, రేపు 15 వతేదీ నాడు మూసి ఉంటాయి కనుక కావలసిన అవసరాలు రేపటి రోజునే సమకూర్చుకోవాలని సూచించారు.

అదేవిధంగా రోజు మార్చి రోజు మార్కెట్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి గనుక కావలసిన పాలు, కూరగాయలు తెచ్చుకో వలసినదిగా, అదే విధంగా ద్విచక్ర వాహనం పైన ఒక్కరు, కారు వంటి వాహనం పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఎవరు ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని, నిత్య అవసరాల నిమిత్తం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి, రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని, మాస్కులు లేకుండా ఎవరు బయట తిరుగరాదని, మిగిలిన సమయాలలో మందుల షాపులు, అత్యవసర ఆసుపత్రులు మినహా మిగిలినవన్నీ మూసి వేయబడతాయని, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపుగా ఇండ్లకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇతరులు ఎవరు తిరుగరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారి పైన వాహనాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల మేరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మరోవైపు జిల్లాలో కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు సోమవారం రాత్రి వరకూ 93 నమోదు అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా వైరస్ బాధితులు ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారు. సామాజిక దూరం పాటించడంతోపాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ లు, శానిటైజర్ వాడటం పై అవగాహన కల్పిస్తున్నారు.