ఏపీలో.. ఏప్రిల్ ‘పథకాల మాసం’..

ఏపీలో వచ్చేమాసంలో పథకాల పండగ జరుగబోతోంది. ఏకంగా ఆరు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నెల పొడవునా.. వివిధ సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకురావడానికి జగన్ సర్కారు వరుస సమీక్షలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నవరత్నాలతో పాటు విద్యార్థులను ఉద్దేశించిన పథకాలు ఈ జాబితాలో ఉన్నాయి. Also Read: జగన్ కు షాకిచ్చిన కేంద్రం సంక్షేమ క్యాలెండరుకు అనుగుణంగా వాటి తేదీలను […]

Written By: Srinivas, Updated On : March 21, 2021 5:20 pm
Follow us on


ఏపీలో వచ్చేమాసంలో పథకాల పండగ జరుగబోతోంది. ఏకంగా ఆరు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నెల పొడవునా.. వివిధ సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకురావడానికి జగన్ సర్కారు వరుస సమీక్షలు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నవరత్నాలతో పాటు విద్యార్థులను ఉద్దేశించిన పథకాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Also Read: జగన్ కు షాకిచ్చిన కేంద్రం

సంక్షేమ క్యాలెండరుకు అనుగుణంగా వాటి తేదీలను అధికారులు ఖరారు చేశారు. వైఎస్సార్ బీమా పథకంతో ఏప్రిల్ కు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రారంభం అవుతాయి.ఆరవ తేదీన వైఎస్సార్ బీమా అమలు అవుతుంది. వైఎస్సార్ బీమా పథకానికి అర్హత ఉండి.. దాని పరిధిలో లేకుండా మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల మేరకు బీమా వర్తించడానికి అవకాశం లేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కల్పించేందుకే ప్రభుత్వమే లబ్ధిదారుల ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు ఈ పథకం కింద అదనంగా.. రూ.12039 కుటుంబాలకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం ఆరో తేదీన విడుదల చేస్తుంది.

Also Read: ఏపీలో.. ఏప్రిల్ ‘పథకాల మాసం’..

గత ఏడాది అక్టోబరు మాసంలో వైఎస్సార్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన తేదీని ప్రాతిపాదికన తీసుకుని, దీన్ని రూపొందించారు. తాజాగా ఇందులో సవరణలు సైతం చేశారు. అర్హత ఉండి నిబంధలన ప్రకారం.. బీమా రాకపోయిన 11022 మంది సాధారణ పరిస్థితులతో చనిపోయినట్లు గుర్తించారు. మరో 1017 మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా.. శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారని నిర్దారించారు.

కొత్తగా గుర్తించిన 12039 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 258కోట్ల రూపాయాలు ఖర్చు చేయనుంది. వచ్చేనెల ఆరవ తేదీన వైఎస్ జగన్ వారికి ఆర్థిక సాయం అందిస్తారు. 9వ తేదీన తొలివిడత జగనన్న విద్యాదీవెన పథకం అమలులోకి వస్తుంది. దీనికింద అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. 13వ తేదీన ఉగాదిని పురస్కరించుకుని వార్డు, గ్రామ వలంటీర్లను సత్కరించనుంది. 16వ తేదీన రైతులకు సున్నా వడ్డీ పకథం, 20న మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ స్కీం, 27న జగనన్న దీవెన కార్యక్రమం అమలులోకి వస్తుంది.