Boyapati Srinu: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అఖండ’ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన ఈ మాస్ డైరెక్టర్ తన తర్వాతి చిత్రం ఎవరితో చేస్తారా ? అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రకటన వచ్చేసింది. యువ కథానాయకుడు రామ్ హీరోగా బోయపాటి ఓ సినిమా చేయనున్నారు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, 5 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొత్తానికి బోయపాటి-రామ్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో చేస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు.
Also Read: ప్రేమకు చిహ్నంగా నిర్మించిన తాజ్ మహల్ గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలివే!
అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టే సరికి.. స్టార్ హీరోలు బోయపాటికి పిలిచి మరీ ఛాన్స్ లు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ కూడా బోయపాటితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడని అన్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా బోయపాటితో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పుష్ప 2 ఉండటంతో.. ఈ సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది.

దాంతో బోయపాటి – రామ్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యింది. అయితే, బోయపాటి ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం.. భారీ రెమ్యునరేషన్ వస్తోందనే. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రానికి రామ్ రూ.9 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద, బోయపాటి, హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం నిజంగా విశేషమే.
పైగా ఈ చిత్రం తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత బాలయ్యతో అఖండ 2 సినిమా చేస్తాడట. పైగా ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. అంటే.. బోయపాటి వరుసగా 3 పాన్ ఇండియా సినిమాలు చేయబోతున్నాడు.
ఇక రామ్ విషయానికి వస్తే.. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ 12 కోట్లు తీసుకున్నాడు. కానీ, బోయపాటి సినిమా కోసం రామ్ తన రెమ్యునరేషన్ ను 3 కోట్లు తగ్గించుకున్నాడు.
Also Read: ‘భీమ్లానాయక్’కి U/A.. పైగా కేటీఆర్ కూడా రాబోతున్నాడు
Recommended Video:
