OTS scheme: జనరల్‌గా ప్రభుత్వాలు వివిధ సామాజికవర్గాల్లో వెనుకబడిన వారికి రుణాలు ఇచ్చే సంగతి అందరికీ తెలుసు. ఇందుకుగాను సెపరేట్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణాలను ఇస్తుంటారు. తద్వారా వారికి స్వయం ఉపాధి కల్పించొచ్చని అనుకుంటారు. అలానే ఎస్సీ, బీసీ, కాపు తదితర కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం కూడా సెపరేట్ కొర్పొరేషన్ ఏర్పాటు చేసింది. అలా పలు కార్పొరేషన్స్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు.

అలా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం నిధులను లబ్ధిదారులకు అందజేస్తుంది. అయితే, ఏపీలో ఏర్పడిన జగన్ ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా ఒక్క రూపాయి కూడా లోన్ ఇవ్వకపోవడం గమనార్హం. అలా వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వకపోయినప్పటికీ గతంలో ఇచ్చిన రుణాల వసూళ్లపై మాత్రం ఏపీ సర్కారు స్పెషల్ ఫోకస్ పెట్టింది.
గతంలో ప్రభుత్వాలు కార్పొరేషన్ వద్ద లోన్ తీసుకుని తిరిగి చెల్లించలేకపోతే, నోటిసులు పంపి ఊరుకున్నాయి. కానీ, ఈ సారి ఏపీ సర్కారు అలా ఊరుకునేలా లేదు. గతంలో తీసుకున్న రుణాలను కంపల్సరీగా వసూలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నోటీసులతో పాటు హెచ్చరికలు పంపుతూ, వెంటనే రుణం తిరిగి చెల్లించాలని చెప్పాలని యోచిస్తుంది.
Also Read: సినీ ఇండస్ట్రీపై జగన్ పంతానికి కారణం తెలిసింది?
అలా కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల నుంచి కనీసంగా రూ.1,000 కోట్లు అయినా తిరిగి వసూలు చేయాలని ఏపీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం. ఒకవేళ కార్పొరేషన్ లోన్ తిరిగి చెల్లించేందుకుగాను లబ్ధిదారులు మొండికేస్తే కనుక వన్ టైమ్ సెటిల్మెంట్ తరహా మరో స్కీమ్ ఒకటి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సర్కారు ఇటీవల ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి డబ్బులు కట్టించుకుని రెగ్యులరైజేషన్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే కార్పొరేషన్లపైన ప్రజెంట్ ఫోకస్ పెట్టినట్లు కనబడుతోంది. అలా ఏపీ సర్కారు కార్పొరేషన్ల లబ్ధిదారులను కూడా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వినికిడి. లబ్ధిదారులు ఎప్పుడో రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా అలానే ఉన్నట్లయితే వారిపైన ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్.
Also Read: పండుగ పూట థియేటర్లపై ఏపీ సర్కారు దాడులు.. భద్రతా ప్రమాణాలపై తనిఖీలు..
[…] […]