
చేతికి ఎముక లేదన్నట్లు జగన్ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. ఏపీలోని ప్రతీఒక్కరు సంక్షేమ పథకాలతో లబ్ది పొందేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం తిరిగి ప్రజలపైనే భారం మోపుతోంది. కరోనా పేరుతో ప్రభుత్వం పన్నులను పెంచుతూ సామాన్యుల నుంచి పిల్చి పిప్పే చేసేందుకు రెడీ అవుతుండటం శోచనీయంగా మారింది.
Also Read: 2024లో గెలుపే లక్ష్యంగా జగన్ పెద్ద ప్లాన్?
దేశంలో ఎక్కడి లేనివిధంగా సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆచరణలో మాత్రం ప్రజలపై పన్నల భారం ప్రభుత్వం అధికంగా మోపుతుందనే టాక్ విన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడం.. కేంద్రం నుంచి కూడా నిధులు రాకపోవడంతో ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బులకు పొంతన కుదరకపోవడంతో బ్యాంకులు కూడా అప్పులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. రిజర్వు బ్యాంక్ వద్ద ఏపీ రుణపరిమితి మించిపోయింది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా సక్రమంగా రాకపోవడంతో ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమైంది. కరోనాతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పన్నులను పెంచుతున్నట్లు జగన్ సర్కార్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు డిజిల్, పెట్రోల్ ధరలపై పన్ను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుంది. తాజాగా మరోసారి పెట్రో ఉత్పత్తులపై పన్ను పెంచి వాహనదారులకు షాకిచ్చింది.
Also Read: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు జగన్ సర్కార్ షాక్..?
ఈనెల 3న జరిగిన క్యాబినెట్లో సమావేశం పన్ను పెంపు నిర్ణయం తీసుకున్న ప్రజల్లో వ్యతిరేక వస్తుందని భావించి కొంత గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఎట్టకేలకు పన్ను పెంపుపై జీవో జారీ చేసింది. పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్ విధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాట్‌కు అదనంగా లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై రూ.1సెస్ విధించింది. డీలర్ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైసీపీ సర్కార్ వచ్చాక ప్రజలపై పన్నుల భారం అధికం కావడంతో ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వస్తోంది.