Homeఆంధ్రప్రదేశ్‌AP Govt: జగన్ సార్.. పేదలపై నీ ప్రతాపమేలా?

AP Govt: జగన్ సార్.. పేదలపై నీ ప్రతాపమేలా?

AP Govt: ఏపీ ప్రభుత్వం పేద ప్రజలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నవాళ్లు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అందులోనూ 75 చదరపు గజాలలోపు ఉన్నవారికి మాత్రమే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని.. 75 కంటే ఒక్క చ.గజం ఎక్కువగా ఉన్నా మొత్తం డబ్బులు చెల్లించాల్సిందేనని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో పేద ప్రజలు వణికిపోతున్నారు. రెండు నెలలలోపు డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించుకోకపోతే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి 2021 ఆగస్టు 23న జీవో నెం 225 విడుదలవ్వగా దీనిలోని నిబంధనలు పేదలకు శాపంగా మారాయి.

AP Govt
AP Govt

2017 గత టీడీపీ ప్రభుత్వం 100 చ.గజాలలోపు వారికి ఫ్రీగా క్రమబద్ధీకరిస్తామని ఆగస్టు 24న జీవో జారి చేసింది. దీనికి మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా 75చ.గజం వరకే ఫ్రీ అనే నిబంధన పెట్టారు. టీడీపీ హయాంలో బీపీఎల్ కుటుంబాలకు 100 గజాల వరకు ఫ్రీగా క్రమబద్ధీకరణ జరిగేది.

AP Govt
AP Govt

Also Read: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!

ఏపీఎల్ కుటుంబాలకు 1 నుంచి 100 గజాల వరకు ఆ స్థలం మూలధన విలువలో 7.5 శాతం ధరను నిర్ణయించారు. దీనిని మాత్రమే పన్ను రూపంలో చెల్లించాలి. ప్రస్తుతం ఏపీలో పూరి గుడెసెల నుంచి సాధారణకు ఇళ్లకు టెలిస్కోపిక్ విధానం అనుసరించకుండా సర్వే చేయడంతో ఓ వ్యక్తి తన 88 చగజాల ఇళ్లు క్రమబద్ధీకరణలో భాగంగా ఏకంగా రూ.16.83 లక్షలు చెల్లించాలని విజయవాడ ఉత్తర మండలం ఎమ్మార్వో నుంచి డిమాండ్ నోటీసు వచ్చింది.

అది చూసి షాక్ అవ్వడం ఆ ఇంటి యాజమాని వంతయ్యింది. అదే టెలిస్కోపిక్ విధానం అమలులో ఉంటే కేవలం అదనంగా ఉన్న 13 గజాలకు చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు 88 చ.గజాల మొత్తానికి చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో చ.గజానికి రూ.1.29లక్షల చొప్పున కట్టాల్సి పడుతోంది. దీంతో పేదలు, కూలి నాలీ చేసుకునే వారం తాము ఎక్కడి నుంచి ఇంత పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపులు.. వేలకోట్లు ఎవరిస్తరు..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version