Undavalli About Chiranjeevi: 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటికే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఒక టర్మ్ పూర్తి చేసుకుని రెండోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. ఆ ఎన్నికల్లో చిరు పార్టీకి 18 స్థానాలు వచ్చాయి. వైఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, మిగతా పార్టీలకు చెందిన ఓట్లను ప్రజారాజ్యం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. దీంతో రెండోసారి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఎన్నికలకు ముందే చిరు, వైఎస్సార్ ఒక ఒప్పందం చేసుకున్నారట.. ‘వైఎస్సార్‌తో.. ఉండవల్లి అరుణ్ కుమార్’అనే పుస్తకంలో ఆనాటి సీక్రెట్స్‌ను ఉండవల్లి బట్టబయలు చేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Undavalli About Chiranjeevi
‘చిరు మన పార్టీలో చేరుతున్నారు. కేంద్రమంత్రి పదవి ఒకటి ఖాళీగా ఉంచండి ’అని హైలీ కాన్ఫిడెన్షియల్ సమాచారంతో వైఎస్ రాసిన లెటర్‌ను ఆయన అనుచరుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సోనియాకు పంపించారు. ఇది ఎప్పుడో కాదు.. ఎన్నికలు ముగిసి.. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చినట్లుగా తేలిన మరుసటి రోజునే. ఈ విషయాన్ని ఎవరు చెప్పినా నిజం అని నమ్మరు. కానీ స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పారు.
Also Read: జగన్ సార్.. పేదలపై నీ ప్రతాపమేలా?
వైఎస్ఆర్‌తో.. తన అనుభవం, జ్ఞాపకాల పేరుతో ఆయన ఇటీవల ఒక పుస్తకాన్ని రాశారు. 2009 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏం జరిగిందో వివరించారు. ఎవరికీ తెలియని సమాచారంతో ఒక మెయిల్ వస్తుందని దానిని ప్రింట్ తీసి సోనియాకు ఇవ్వాలని వైఎస్సార్ ఉండవల్లికి చెప్పారట. అయితే, ఉండవల్లికి ప్రింట్ తీయడం రాదు. పీఏ తీస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. సీల్డ్ కవర్‌లో పెట్టినా తెలిసిపోతుందని చెప్పారట. దీంతో వైఎస్ ఆ లెటర్ సీక్రెట్ చెప్పారట.
చిరంజీవి మన పార్టీలో చేరిపోతారు. ఆయన కోసం కేంద్రమంత్రి బెర్త్ ఖాళీగా ఉంచమని సోనియాకు ఇచ్చే సూచన అది. దీని ప్రకారం ఎన్నికలకు ముందే చిరంజీవి, వైఎస్ ఓ ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తే పీఆర్పీని విలీనం చేయడం.. కింగ్ మేకర్ అయితే.. పొత్తు పెట్టుకోవడం అందులో భాగమని అప్పట్లో ప్రచారం జరిగింది. దాన్ని ఉండవల్లి తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆనాడు పీఆర్పీకి ఓట్లు వేసిన ప్రజలతో పాటు మెగా అభిమానులు కూడా షాక్ అయ్యారట.
Also Read: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!