https://oktelugu.com/

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివీ

ఏపీ సీఎం జగన్ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత సుధీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటి ఇదే కావడం విశేషం. సీఎం జగన్ మంత్రులంతా సమావేశమై చాలా నిర్ణయాలను తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తాజాగా మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ఏపీ ప్రభుత్వం ఈ కేబినెట్ భేటిలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, పలు కట్టడి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2020 / 07:13 PM IST
    Follow us on

    ఏపీ సీఎం జగన్ కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత సుధీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటి ఇదే కావడం విశేషం. సీఎం జగన్ మంత్రులంతా సమావేశమై చాలా నిర్ణయాలను తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తాజాగా మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఏపీ ప్రభుత్వం ఈ కేబినెట్ భేటిలో అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, పలు కట్టడి నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది.. గత ప్రభుత్వంలోని సున్నా వడ్డీ బకాయిలు రూ. 1051 కోట్లు ఇస్తామని ప్రకటించింది. అక్టోబర్ పంట నష్టం పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఈ నెలాఖరులోగానే ఇన్ పుట్ సబ్సిడీని అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం. ఇక రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలకు భూముల కేటాయింపు.వైద్యారోగ్య శాఖలోని టీచింగ్ స్టాఫుకు యూజీసీ స్కేల్ అమలుకు నిర్ణయం.

    Also Read: ఏపీ మరో బృహత్ కార్యానికి జగన్ శ్రీకారం

    ఏపీలో పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు.. మహిళల నేతృత్వంలో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు. అక్వా కల్చర్ సీడ్ యాక్ట్ 2020కు కేబినెట్ ఆమోదం తెలిపిందని కన్నబాబు వివరించారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం.150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం.గత చంద్రబాబు ప్రభుత్వంలోనే దీనికి 500 ఎకరాలు కేటాయించారు. అవుట్ సోర్సింగ్ ద్వారా డెప్యూటేషన్ పై ఎస్ఈబీ పోస్టులను ఏర్పాటు చేసి ఏపీలో గ్యాంబ్లింగ్, బెట్టింగ్, డ్రగ్స్ ను కట్టడి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

    ఇక ‘జగనన్న తోడు’ పేరుతో చిరు వ్యాపారులకు రూ.10వేల రుణం ఇవ్వాలని నిర్ణయించారు. 9 లక్షలకు పైగా చిరు వ్యాపారులకు దరఖాస్తులు చేసుకున్నారు. నవంబర్ 24న జగనన్న తోడు పథకం ప్రారంభం. సుమారు రూ.1000 కోట్లు కేటాయింపు. ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి. వారి విడుదలకు కెబినెట్ ఆమోదం. ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోరాలని కెబినెట్లో నిర్ణయం.

    Also Read: అమరావతి భూకుంభకోణం: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

    కొత్త ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు కేబినెట్ ఇవాళ ఆమోదించింది. సీఎం జగన్ ఇసుక పాలసీపై గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ కమిటీ సిఫారసులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని ఇసుక రీచులను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సిఫారసులు చేసింది. దీనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇసుక రీచులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ముందుకు రాకపోవడంతో పేరొందిన సంస్థలకు ఇసుక రీచులను అప్పగించాలని నిర్ణయించారు. ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇసుక తవ్వకాలు, సరఫరాను ఒకే సంస్థకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.వరదలు భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై రూపొందిన అంచనాలను కేబినెట్ లో చర్చించారు. సుమారు 10వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనావేసింది. కేంద్ర అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.