క్రేజీ రూమర్ : ఛత్రపతి శివాజీగా మహేష్ బాబు !

గతంలో ఏ టాలీవుడ్ డైరెక్టర్ కు సాధ్యం కానీ రేంజ్ ను సాధించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. నేషనల్ లెవల్లో దర్శక ధీరుడు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే మాటలా… అసలు ఒక తెలుగు సినిమా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తోందని ఎవరైనా ఉహించగలరా ? అందుకే రాజమౌళిని నేషనల్ డైరెక్టర్ అని కీర్తిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా […]

Written By: admin, Updated On : November 5, 2020 7:19 pm
Follow us on


గతంలో ఏ టాలీవుడ్ డైరెక్టర్ కు సాధ్యం కానీ రేంజ్ ను సాధించిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. నేషనల్ లెవల్లో దర్శక ధీరుడు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే మాటలా… అసలు ఒక తెలుగు సినిమా పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేస్తోందని ఎవరైనా ఉహించగలరా ? అందుకే రాజమౌళిని నేషనల్ డైరెక్టర్ అని కీర్తిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుండి ఇద్దరు హీరోల టీజర్ లకు సంబంధించిన వీడియోలు కూడా జనాన్ని ఒక ఊపు ఉపేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

అందుకే రాజమౌళి తరువాత సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, ఆ మధ్యే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక ఊహాగానాలు.. అనేక సిల్లీ కథనాలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో సిల్లీ రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

Also Read: బోల్డ్ వెబ్ సిరీస్ లో రాశి, నభా !

ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇక రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహేష్ సినిమా పై వర్క్ చేయడానికి కారణం రాజమౌళి టైం వేస్ట్ చేయకూడదు అనే ఉదేశ్యమేనట. ఎలాగూ కరోనా దెబ్బకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది కాబట్టి.. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లో మహేష్ సినిమా పై జక్కన్న వర్క్ చేస్తున్నాడట.

Also Read: ఆర్ఆర్ఆర్: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. సరికొత్త ట్విస్ట్.!

ఇక ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సగానికి ఈ సినిమా పూర్తయిపోతుంది. కాబట్టి ఆ తరువాత రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉంటే చేసేయాలని మహేష్ ప్లాన్. మరి అప్పటిలోగా రాజమౌళితో మహేష్ సినిమా కుదురుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా క‌రోనా వ‌చ్చి సినీ పరిశ్ర‌మ మొత్తం ష‌ట్‌డౌన్ అవ్వకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికి మహేష్ – రాజమౌళి సినిమా వర్క్ మొదలై ఉండేది.