ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. నెలనెలా అప్పుల భారం పెరిగిపోతోంది. వడ్డీలతో కుదేలైపోతోంది. ఏఢు శాతం వడ్డీతో ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద అప్పు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితిపై నిపుణులు సైతం నివ్వెరపోతున్నారు. అప్పు తిరిగి చెల్లించే వాడికే భయం ఉంటుంది. కానీ తిరిగి చెల్లించే ఉద్దేశం లేని వాడికి అప్పు ఎంతైనా ఫర్వాలేదని ఏపీని చూస్తే తెలుస్తుంది.
ఇంత కాలం వడ్డీలకు తెచ్చి కాలం నెట్టుకొస్తున్న ప్రభుత్వానికి ఇంకా మూడేళ్లు గడవాలంటే గగనమే అని చెబుతున్నారు పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. కొద్ది వారాలుగా వడ్డీ గురించి ఆలోచన చేయకుండా గొప్పల కోసమైనా అప్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి జంకుతున్నాయి. గ్యారంటీ ఇస్తామన్నా నమ్మడం లేదు.
దీంతో ఆర్బీఐ కూడా వెనక్కి తగ్గుతోంది. ఈ వారం తీసుకున్న అప్పుతో వచ్చే డిసెంబర్ వరకు తీసుకోవాల్సిన రుణ పరిమితి దాదాపుగా అయిపోయిందని తెలుస్తోంది. అందుకే మరింత అప్పులు తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మినహాయించిన అప్పుల మొత్తం మళ్లీ తమకు కేటాయించాలని కోరుతోంది.
ఏపీ సర్కారు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం ఖాయమని చెబుతున్నారు. వేతనాలు,పింఛన్లు పంపిణీ చేయడానికి కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుంది. అప్పుల వల్ల ఎఢాపెడా వాయిదాలు చెల్లించే భారం పెరుగుతుంది. ఆర్బీఐ ముందుగానే మినహాయించుకుంటుంది. దీంతో జీతాలు చెల్లించేందుకు కూడా కష్టాలు పడాల్సి వస్తోంది. ఏపీ సర్కారుకు ఇది మరింతగా ఇబ్బంది పెట్టే అంశంగా మారుతోంది.