Taxes In AP: కుయ్యో మొర్రో అంటున్న ఏపీ ఆర్థిక వ్యవస్థను లేపాలంటే… ‘తప్పదు.. ప్రజలపై భారం వేయాలి.అందుకే అగ్గిపుల్ల సబ్బుబిల్లు.. ఆఖరుకు చెత్తను కూడా వదలకుండా పన్నులు వేయాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యిందట..’’ పన్నులతో ప్రజల పన్నులు పీకేందుకు అధికారులంతా సిద్ధమయ్యారట.. ఈ ఏడాది ఆర్థికసంవత్సరం ముగింపులోగా అంటే ఈనెల 31లోగా పెండింగ్లో ఉన్న మొత్తం పన్నులు వసూలు చేయాలని సర్కార్ రెడీ అవుతోందట.. సో ఏపీ ప్రజలు ఇక మీరు పారా హుషార్? పన్నులు కడుతారా? ఏపీ సర్కార్ చర్యలకు బలి అవుతారా? అన్నది మీ ఇష్టం ఇక..
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పన్నుల మోత మొదలైంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఏపీ ప్రభుత్వం పలు ఆఫర్లు ప్రకటించింది. పన్నులు కట్టకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరికలు పంపింది. ఇవి విని ఇప్పుడు ఏపీ ప్రజలంతా బెంబేలెత్తుతున్నారు. ఇదేం తంటరా నాయనా అంటూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి నెలకొంది.
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?
జగన్ సర్కార్ పన్నులు కొరఢా ఝలిపించింది. ఈ క్రమంలోనే ఆస్తి పన్నుతోపాటు, చెత్త పన్ను, నీటి తీరువా, దుకాణాలు, హోటల్స్, ఇతర వాణిజ్య కార్యకలాపాల షాప్ లకు లైసెన్స్ ఫీజును డబుల్ చేసేసింది. ఇవి కట్టలేదనుకో నేరుగా రంగంలోకి అధికారులు దిగుతారట.. చెత్త పన్ను కట్టకపోతే ఆ ఇంటి ముందు చెత్త వేసేస్తారట.. ఇక ఆస్తి పన్ను కట్టకపోతే ఇంట్లోని సామాన్లు తీసుకెళుతారట.. నీటి తీరువా పన్ను కట్టకపోతే రైతు పొలంలోకి వెళ్లి నిలదీస్తారట.. ఇక హోటల్లు, షాపులు దుకాణాల వారి షాపులకు వెళ్లి బంద్ చేయిస్తారట.. ఇలా పన్నుల వసూలు ఏపీ సర్కార్ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం అందుతోంది.
జగన్ సర్కార్ ఈ మార్చి 31లోగా ఆస్తిపన్ను, చెత్తపన్ను ద్వారానే ఏకంగా 1000 కోట్లు వసూళ్లు రాబట్టాలని కంకణం కట్టుకుందట.. ఇతర పన్నుల టార్గెట్లు కూడా వందల కోట్లే ఉన్నాయి. ఇలా ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్ ను గట్టించేందుకు ప్రజలపైనే భారం మోపాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలిసింది.
చెత్త, ఆస్తి పన్నుకట్టకపోతే ఏం చేస్తామో కూడా ఫ్లెక్సీలు తయారు చేసి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ చేశారు. ఇంటి తలుపుల నుంచి సామాను వరకూ తీసుకెళతామని.. చెత్తను ఇంటిముందు వేస్తామని ఆ పోస్టుల్లో చూపించి జనాలను మానసికంగా పన్నులు కట్టేందుకు సిద్ధం చేస్తున్నారు.
ఇక పన్నుల వసూళ్లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేయడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోగా పెండింగ్ అన్ని క్లియర్ చేయించాలని వారికి టార్గెట్ కూడా పెట్టిందట..
ప్రజలు పన్నులు కట్టకపోతే ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో చూపించేసరికి జనాలు హతాషులవుతున్నారు. పన్నులు కట్టకపోతే తమ పరువు తీస్తారా? అని ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం చర్యలతో జగన్ సర్కార్ గల్లాపెట్టే అయితే నిండుతుంది కానీ.. దీని వల్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో మాత్రం లెక్కగట్టడం లేదు. ఈ విషయంలో దురుసుగా వెళితే మొదటికే మోసం వస్తుందన్న సంగతి జగన్ మరువకూడదు.
Also Read: AP Govt Announced New Jobs: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. ఏపీలొ కొలువుల జాతర.. సేమ్ స్ట్రాటజీ