
ఏపీలో ప్రస్తుతం ఓ కొత్త అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే దీన్ని ఏ తెలుగుదేశం వాళ్లో.. వైసీపీ నాయకులో చేయడం లేదు.. సాక్ష్యత్తూ… ఆర్థిక నిపుణులు వేస్తున్న అంచనాలు ఇవీ..ప్రభుత్వం పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉండి ఆర్థిక అధికారాల నిర్వహణలో రాటుదేలిపోయిన వారు.. ప్రస్తుతం ఈ చర్చకు తెరతీస్తున్నారు. ఏపీ ఆర్థికశాఖలో ముఖ్య అధికారులు జైలుకెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే జైలుకు వెళ్లేంత తప్పు సంబంధిత అధికారులు చేయలేదు. వారు చేసింది కేవలం అప్పు మాత్రమే..
అయితే ఆ అప్పు చేసిన విధానమే.. ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ కింద రూ.25వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అయితే ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే.. అలా రుణం ఇవ్వరు కదా.. ఆస్తులు.. ఆదాయం కచ్చితంగా ఉండాలి.
ఇందుకోసం ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని ఈ శాఖకు మళ్లిస్తున్నారు. దీనికోసం ఎస్ర్కో ఖాతాలు ప్రారంభించారు. ఆ డబ్బుతో పథకాల చెల్లింపులు చేస్తే సమస్య ఉండేది కాదు. కానీ ఆ డబ్బును అప్పుల కింద జమ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. వచ్చే ఆదాయం అంతా అప్పుల కింద జమ చేస్తున్నారు. అంటే ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారన్న మాట. ఇప్పుడీ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని ఆర్థికశాఖ అధికారులు తాకట్టు పెట్టడం నేరమని అంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఐవైఆర్ కృష్ణారావు ఎక్కువగా ఆర్థికశాఖలో పనిచేశారు. జగన్ సలహాదారుగా వ్యవహరించిన వీపీ రమేశ్ కూడా ఆర్థికశాఖలో ఎక్కువకాలం కొనసాగారు.
వీరిద్దరు అప్పులకోసం అనుసరించిన విధానం తప్పని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఈ విషయం ప్రస్తుతానికి కేంద్రం దృష్టికి వెళ్లలేదు. వెళ్లితే.. పరిస్థితి సీరియస్ గా ఉంటుందని అంటున్నారు. ఈ అప్పుల కోసం జనం ఆదాయాన్ని తాకట్టుపెట్టన అధికారులు జైలుకు పోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. సాధారణంగా తప్పలు చేసి అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ.. అప్పు చేసి మరీ.. జైలుకు వెళ్లాల్సిన సందర్భం రావడం ఏపీలో ఇప్పుడు చర్చనీయంశంగా మరింది.